Suburban, Mofussil bus services resume in Hyderabad శివారు ప్రాంతాలకు పునఃప్రారంభమైన బస్సు సర్వీసులు

Tsrtc resumes mofussil bus services to sub urban limits of ghmc

Hyderabad, tsrtc bus services, TSRTC, Telangana State Road Transport Corporation, Hyderabad unlock, Greater Hyderabad, coronavirus in hyderabad, TSRTC Buses, City Services, Suburban bus services, Outer Hyderabad, TSRTC, Lockdown, GHMC, Coronavirus, covid-19

TSRTC resumed suburban and mofussil bus services in the Hyderabad outskirts on Wednesday. The buses are being run to Rajendranagar, Maheshwaram, Ibrahimpatnam and Bandlaguda

శివారు ప్రాంతాలకు పునఃప్రారంభమైన బస్సు సర్వీసులు

Posted: 09/24/2020 03:21 AM IST
Tsrtc resumes mofussil bus services to sub urban limits of ghmc

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మార్చి మాసంలో విధించిన లాక్ డౌన్ కారణంగా డిపోలకు మాత్రమే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఇవాళ ఉదయం నుంచి రోడ్డెక్కాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దాదాపు ఆరునెలలుగా బస్సులు లేకపోయినా నగరజీవి తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరాత్ర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాడే తప్ప.. బస్సుల కోసం మాత్రం వేచిచూడలేదు. ఇక అన్ లాక్ ప్రారంభం జూన్ నుంచి అమల్లోకి వచ్చానా.. హైదరాబాద్ లో శరవేగంగా విస్తరిస్తూ నగరవాసులను భయకంపితులను చేసిన కరోనా దెబ్బకు ప్రభుత్వం కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకుంది.

ఇందులో భాగంగా నగరంలో క్యాబ్ సర్వీసులను కూడా ఆన్ లాక్ 2.0 నుంచే అనుమతిని ఇచ్చిన తెలంగాణ సర్కార్.. ప్రజా రవాణాను మాత్రం ప్రారంభించడంలో సాధ్యసాధ్యాలను పరిశీలించిందే తప్ప నగరంలో బస్సుల సంచారానికి అనుమతిని ఇవ్వలేదు. అన్ లాక్ 3.0 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంతర్ జిల్లా బస్సులను అనుమతించినా.. నగరంలో మాత్రం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేచిచూచే ధోరణినే అవలంభించింది. కాగా అన్ లాక్ 4.0తో దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి రావడంతో ఇక తాజాగా ఇవాళ్టి నుంచి నగరశివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటికే తెలంగాణాలో అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాలో బస్సు సర్వీసులు అందుబాటులోకి రాగా ఇక ఇవాళ్టి నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు బస్సులు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. నగరశివారు ప్రాంతాల్లో ఆర్టీసీ సబర్బన్, ముఫిసిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారు జాము నుంచి బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. 200 లకు పైగా ట్రిప్ లు వేసేలా బస్సులను గ్రేటర్ ఆర్టీసీ ప్రారంభించింది. అయితే సిటీలో నడిచే బస్సులపై ఆర్టీసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిటీ సర్వీసులకు సంబంధించిన అన్ని బస్సు డిపోలలో ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. డ్రైవర్లు, కండక్టర్లు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Buses  City Services  Suburban bus services  Outer Hyderabad  TSRTC  Lockdown  GHMC  Coronavirus  covid-19  

Other Articles