Majority of Covid cases in Hyderabad asymptomatic: Study హైదరాబాద్లో 68 శాతం అసింప్టమాటిక్ కరోనా రోగులు

Asymptomatic covid 19 cases have higher viral load finds cdfd study

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Hyderabad, Asymptomatic case, viral load, asymptomatic patients, CDFD, NCBS, NIMS, Infection rate, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Asymptomatic Covid-19 persons carry much higher viral load than symptomatic cases and could be the reason behind the fast transmission of the infection in the country, a study by researchers from Hyderabad-based Centre for DNA Fingerprinting and Diagnostics (CDFD), in collaboration with the National Centre for Biological Sciences (NCBS) and Nizam's Institute of Medical Sciences (NIMS) has found.

డేంజర్ బెల్స్: హైదరాబాద్లో 68 శాతం అసింప్టమాటిక్ కరోనా రోగులు

Posted: 09/21/2020 02:18 PM IST
Asymptomatic covid 19 cases have higher viral load finds cdfd study

(Image source from: Oneindia.com)

హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు ఉద్దృతి కొనసాగి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజా అధ్యయనాలు మాత్రం కరోనా విజృంభన మాత్రం ఆగిపోలేదని స్పష్టం చేస్తోంది. మహానగర వాసుల్లో కరోనా మహమ్మారి కాటు వేయడానికి సిద్దంగా వుందని వెల్లడించింది. లక్షణాలు లేని రోగుల ద్వారా కరోనా వ్యాప్తి మాటువేస్తోందని తెలిపింది. నగరంలోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో తమ తాజా అధ్యయనంలో అనేక ఆందోళనకర విషయాలు వెల్లడించింది. కరోనా లక్షణాలు ఉన్నవారి కంటే లేని వారికే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టు ఈ సర్వేలో తేటతెల్లమైందని తెలిపింది.

లక్షణాలు వున్న రోగులతో పోల్చితే.. లక్షణాలు లేని రోగుల్లో కరోనా వైరస్ లోడు అధికంగా వుందని స్పష్టమైందని అధ్యయనాలు స్పష్టం చేసింది. మే, జూన్ నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లో కరోనా బారినపడిన 210 మంది రోగుల డేటాను సేకరించి విశ్లేషించిన అనంతరం ఈ విషయాలు వెల్లడించింది. మరీ అందోళనకర విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ఏకంగా చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా రకం (20-బి) వుందని తేల్చింది. దీంతో పాటు 19-ఏ, 20-ఏ రకం నమూనాలు కూడా వున్నాయని తెలిపింది. అయితే నగరంలోని దాదాపు 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం వైరస్ ఉన్నట్టు తేలింది.

అసింప్టమాటిక్ రోగుల్లో వైరస్ లోడు అధికంగా ఉందని, దీంతో వారు కరోనా వైరస్ వ్యాప్తిని వేగంగా విస్తరించే ప్రమాదం కూడా వుందని, కరోనా వ్యాధి వ్యాప్తికి లక్షణాలు లేని రోగులు క్యారియర్స్ గా మారుతున్నారని అందోళన వ్యక్తం చేసింది. ఇక దీంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా అదే స్థాయిలో ఉండడంతో వారంతా ఆరోగ్యంగా ఉన్నట్టు బయటకు కనిపిస్తుంటారని ఈ సర్వేలో తేలింది. వీరి నుంచి ఇమ్యూనిటీ స్థాయిలు తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకి వారి మరణానికి కారణమవుతున్నట్టు సర్వే గుర్తించింది. జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటే 70 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడ్డారని తేల్చింది, వీరి నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. పరోక్షంగా వారి మరణానికి కారణమవుతున్నట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Asymptomatic case  viral load  asymptomatic patients  CDFD  NCBS  NIMS  Infection rate  Hyderabad  GHMC  

Other Articles