Death toll rises to 10 as Building Collapse Near Mumbai మూడంతస్థుల భవనం కుప్పకూలి 10 మంది మృతి

10 killed over 20 feared trapped after 3 storey building collapses in mumbai

building collapsed in Patel Compound area, building collapsed in Bhiwandi, building collapsed in Thane municipality, building collapsed in mumbai, building collapsed in Maharashtra, three storey building collapsed in Bhiwandi, 3 storey building collapse in Mumbai, Patel Compound area, Bhiwandi, three storey building, building collapse, Mumbai, Maharashtra, crime

At least 10 people lost their lives and as many as 20 to 25 people are feared trapped after a three-storey building collapsed in Patel Compound area in Bhiwandi near Mumbai early this morning. The incident happened at around 3:40 am while the residents were asleep.

ITEMVIDEOS: ముంబైలో విషాదం: మూడంతస్థుల భవనం కుప్పకూలి 10 మంది మృతి

Posted: 09/21/2020 01:59 PM IST
10 killed over 20 feared trapped after 3 storey building collapses in mumbai

ముంబై నగరంలో మరో ఘోరం ప్రమాదం సంభవించింది. ముంబై నగరం సమీపంలోని భీవండీ ప్రాంతంలో వున్న ఓ మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సరిగ్గా తెల్లతెల్లవారుతున్న వేకువ జామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడగా, ఏకంగా 25 మంది శిధిలాల మధ్యలో చిక్కుకున్నారు. ముంబై సమీపంలోని థానే మున్సిపాలిటీ పరిధిలో గల భీవండీ ప్రాంతంలోని పటేల్ కాంపౌండ్ ఏరియాలోని ఈ ఘటన జరిగింది. మూడంస్థుల భవనం కుప్పకూలడంతో ఉలిక్కిపడి లేచిన స్థానికులు హుటాహుటిన శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు.

స్థానికులు 20 మంది వరకు శిధిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించగా, ఘటన సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ రెస్య్కూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని శిధిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎస్ బృందాలు పదిహేను మందిని రక్షించాయి. ఇంకా సహాయక చర్యలు కోనసాగుతున్నాయి. వీరిలో ఓ చిన్నారి కూడా వున్నారు. కాగా, భీవండీలో ఇటీవలే ఓ ఐదంతస్థుల భవనం కూడా కుప్పకూలి పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బిల్డింగ్ యజమానితో పాటు అందుకు కారణమైన వారిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

తెల్లవారుజామున అంతా గాఢనిద్రలో వుండగా మూడు గంటలా నలబై నిమిషాలకు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ భవనంలో ఏకంగా 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బలగాలు 40 మంది ఎమర్జెన్సీ వర్కర్లతో పాటు 30 మంది రెస్క్యూ టీమ్ తో ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. వీరికి తోడు స్నిఫర్స్ డాగ్ స్వాడ్ కూడా రంగంలోకి దిగి శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తిస్తుందని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సత్యానారాయణ ప్రధాన్ తెలిపారు. ఈ విషాదఘటన తనను కలిచివేసిందని ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patel Compound area  Bhiwandi  three storey building  building collapse  Mumbai  Maharashtra  crime  

Other Articles