AP Govt imposes cess of fuel charges ప్రజలపై ఇంధన సెస్సు భారం మోపిన ఏపీ ప్రభుత్వం..

Andhra pradesh levies re 1 road development cess on petrol diesel

cess on fuel, levy of fuel, road development cess, petrol, diesel, Lpg gas price, Lpg Gas, VAT hike, Value Added Tax, covid-19 crisis, andhra pradesh

The Andhra Pradesh government on Friday promulgated an ordinance providing for levy of a Road Development Cess of Re 1 each per litre on petrol and high- speed diesel that would net around ₹500 crore annually.

ప్రజలపై ఇంధన సెస్సు భారం మోపిన ఏపీ ప్రభుత్వం..

Posted: 09/18/2020 11:43 PM IST
Andhra pradesh levies re 1 road development cess on petrol diesel

కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కోనసాగుతున్న క్రమంలో ప్రభుత్వాలు పేద, బడుగు, బలహీన, మధ్యతరగతివారికి అండగా నిలచి.. మేమున్నాం అని ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే ప్రభుత్వాలు తాము ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసమే వున్నామన్న విషయాన్ని మర్చిపోయి ధరభారాన్ని మోపుతున్నాయి. ఇదివరకే రాష్ట్రంలో పడిపోయిన అదాయాన్ని పెంచుకునేందుకు ఇప్పటికే ఇంధన ధరలపై వ్యాట్ పెంచుతూ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ తరువాత గ్యాస్ ధరలు పెంచి షాక్ ఇచ్చిన సర్కార్ తాజాగా ఇంధన ధరలపై సెస్ విధించింది.

గత వారం క్రితమే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై పెంచింది. రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నిధులు కొరత ఏర్పడిన తరుణంలో గ్యాస్ ధరలపై కూడా వ్యాట్ ను భారీగా పెంచింది. వంట గ్యాస్ పై వున్న వ్యాట్ పన్నును 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచింది. గత శనివారం నుంచి ఈ పెంచిన ధరలు అమల్లోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే సరిగ్గా వారం రోజుల తరువాత ఇవాళ మరోమారు ఇంధన ధరలపై సెస్ ను విధిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది, వారం రోజుల క్రితం పెంచిన గ్యాస్ ధరలు ఇప్పటికే ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుండగా, మరో పర్యాయం ధరలు పెంచడంతో ప్రజలు తమ బాధలను ఎవరితో మొరపెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఇప్పటికే అధిక ధరలున్న తమపై మరోమారు ధరల బాంబు విసురుతున్నారని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాట్ కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధిస్తున్నట్లు తెలిపింది. డీలర్ వద్ద నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని  ప్రభుత్వం ఆర్డినెన్స్ లో పేర్కొంది.  రహదారి అభివృద్ధి నిధి కోసం ఈ సెస్ వసూలు చేస్తున్నట్టు గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు  రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. సెస్ ద్వారా 600 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని  ప్రభుత్వం అంచనా వేస్తుంది.  ఈ అదనపు ఆదాయాన్ని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles