Dubai suspends Air India Express flights ఎయిరిండియా విమానాలను నిషేధించిన దుబాయ్

Dubai suspends air india express flights till 2 oct for flouting covid rules

Air India Express, Dubai Civil Aviation Authority, Covid-19, Flight suspension, Air India Ltd, corona positive patient, Air India, Dibai Government

Dubai Civil Aviation Authority has suspended all operations of Air India Express-the no-frill subsidiary of national carrier Air India Ltd-to operate across all airports in the country till 2 October after the airline was found to have carried covid-19 infected passengers on board of its flight to the Gulf nation on 4 September.

ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానాలను నిషేధించిన దుబాయ్

Posted: 09/18/2020 08:29 PM IST
Dubai suspends air india express flights till 2 oct for flouting covid rules

ప‌్ర‌భుత్వ‌రంగ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాల‌పై దుబాయ్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. దుబాయ్ లోని ఏ విమానాశ్రయంలోనూ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కొనసాగించరాదని అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తాజాగా తాము ఎయిర్ ఇండియా సర్వీసులపై విధించిన నిషేధం అక్టోబర్ 2 వరకు అనగా పక్షం రోజుల వరకు కొనసాగనున్నాయని అక్కడి ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. భారత్ తో సత్సంబంధాలు కలిగిన దుబాయ్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు చేసిన తప్పిందమే కారణమని ప్రకటించింది.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం.. విమానయాన నిబంధనలను ఉల్లంఘించి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ క‌లిగిన ప్ర‌యాణికుల‌ను తీసుకువ‌చ్చిందని తెలిపింది. నిబంధనలు మీరి ఇలా కరోనా రోగిని తీసుకువచ్చినందుకు దుబాయ్ సివిల్ ఏవియేష‌న్ అథారిటీ ఎయిర్ ఇండియా స‌ర్వీసుల‌ను అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు నిలిపివేసిన‌ట్లు అధికారులు తెలిపారు. యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, భారత్‌ నుంచి వ‌చ్చే ప్రతి ప్రయాణికుడు 96 గంట‌ల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాల‌ని, అందులో నెగిటివ్ నిర్ధారణ‌ కావాల‌ని, ఆ స‌ర్టిఫికెట్ ఉంటేనే దుబాయ్‌కి వెళ్ల‌డానికి వీలుంటుంద‌న్నారు.

అయితే ఈనెల 4న జైపూర్ నుంచి దుబాయ్ కు వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ఓ వ్య‌క్తి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ తో ప్రయాణించాడ‌ని పేర్కోంది, సదరు ప్రయాణికుడి వ‌ద్ద సెప్టెంబర్ 2 తేదీతో కోవిడ్-పాజిటివ్ సర్టిఫికెట్ ఉందని చెప్పారు. అయితే ఇది పొరబాటుగా జరిగిన ఘటన కాదని, గ‌తంలోనూ ఇలాంటి తప్పిదానికే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం పాల్పడిందని వెల్ల‌డించారు. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాల‌ను సెప్టెంబ‌ర్ 18 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిలిపివేసినట్లు తెలిపారు.

ఇక దీనికి తోడు విమాన సిబ్బందితో పాటు ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు ఎవరైనా కరోనా బారిన పడితే వారి వైద్య చికిత్స, క్వారంటైన్ కు సంబంధించిన మొత్తాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమాన సంస్థ భరించాలని కూడా దుబాయ్ పౌర విమానయాన శాఖ నోటీసులో పేర్కోంది, ఇక దీనికి తోడు ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా కోచ్చి కేంద్రంగా నడిచే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఎలాంటి చర్యలు చేపడుతోందన్న కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ సమర్పించాలని కోరింది, కాగా, ఈ పరిణమాలపై స్పందించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ అధికార నిషేధం వున్న పక్షం రోజులు తమ దుబాయ్ విమానాలను షార్జాకు మళ్లిస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles