Ganesh immersion in progress sans pomp and gaiety వినాయక నిమజ్జనంలో భక్తజనం తగ్గినా.. ఎగసిన భక్తి పారవశ్యం

Ganesh immersion at hyderabad hussain sagar in progress sans pomp and gaiety

Ganesh immersion, Hussain sagar, Traffic diversion, Khairatabad Ganesh, Balapur Ganesh, Small size Ganesh, Vinayaka chaviti, Anantha Chaturdhi, Hyderabad

The Ganesh immersion at the picturesque Hussainsagar lake in the city, which used to attract lakhs of people every year, was sombre affair on Tuesday diue to Corona virus restrictions, with smaller groups of people carrying small sized idols of Lord Ganesh in the immersion ceremony marking the end of the ten-day Vinayaka chaviti.

వినాయక నిమజ్జనంలో భక్తజనం తగ్గినా.. ఎగసిన భక్తి పారవశ్యం

Posted: 09/01/2020 06:41 PM IST
Ganesh immersion at hyderabad hussain sagar in progress sans pomp and gaiety

వినాయక నిమజ్జనంపైనా కరోనా వైరస్ మహమ్మారి తన ఉనికిని చాటింది. అయితే కరోనా నేపథ్యంలో ఎక్కడా లడ్డూ ప్రసాదం వేలం కొనసాగలేదు. గతంలో వేల సంఖ్యలో భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకోగా, ఈ సారి మాత్రం వందల సంఖ్యలోనే జనం నిమజ్జనోత్సవాలకు హాజరయ్యారు. భక్తజన సందోహం అంతగా కనిపించకపోయినా.. భక్తుల్లో మాత్రం భక్తి పారవశ్యం మాత్రం వెల్లివిరిసింది. నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు వచ్చిన గణనాధులతో ఆయా ప్రాంతంలో కోలాహలం కొనసాగుతోంది, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. జై బోలో గణేశ్‌ మహరాజ్‌కీ జై, గణపతి బొప్పా మోరియా అంటూ ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.

గతంలో భారీ విగ్రహాలతో.. భారీ వాహనాల్లో డీజే సౌండ్ ల మధ్య గణనాధులను గంగమ్మ ఒడికి తరలించే భక్తులు.. ఈ సారి మాత్రం కరోనా నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు పోలీసుల ముందస్తు చర్యలు, సూచనలతో చిన్న చిన్న విగ్రహాలను అందంగా ముస్తాబు చేసిన వాహనాల్లో తీసుకొస్తున్నారు. గణనాధుల నిమజ్జనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఇటు వేచి వుండేందుకు కూడా అవకాశం లేకుండా హుస్సేన్‌సాగర్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌లో 5, ట్యాంక్‌బండ్‌పై 10, రోటరీ పార్కు వద్ద 2, ఇతర ప్రాంతాల్లో మరో 4 క్రేన్లను పోలీసులు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఖైరతాబాద్ గణేశుడు అందరు వినాయకుల నిమజ్జనం పూరైన తరువాత జరిగేది. కాగా తెలంగాన రాష్ట్రంలో ముందుగా ఖైరతాబాద్ గణేశుడినే తొలిగా నిమజ్జనం చేస్తున్నారు. ఆ తరువాతే అన్ని గణనాధుల నిమజ్జనం కొనసాగడం అనవాయితీగా మారింది, దీంతో ఇవాల మధ్యాహ్నం ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం జరిగింది, ఈ సారి కరోనా అంక్షల నడుమ 40 అడుగులకు పైనే వుండే ఖైరతాబాద్ గణనాధుడు.. కేవలం 9 అడుగుల ధన్వంతరీ గణేశుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఇక అటు ప్రసిద్ద బాలపూర్ గణేశుడు నిమజ్జనానికి వవస్తున్నాడు, బాలాపూర్ నుంచి ఏకంగా 18 కిలోమీటర్ల పోడువునా బాలాపూర్ గణేశుడి ఊరేగింపు సాగనుంది.  

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. గత అర్థరాత్రి నుంచే నగరంలోకి అంతర్రాష్ట్ర, జిల్లాల లారీలకు అనుమతి నిలిపివేశారు. గణేశ్‌ ప్రతిమల నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా, కట్టుదిట్టమైన పోలీసు‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణనాథుడి ఉత్సవాలు నిరాడంబరంగా సాగిన నేపథ్యంలో నిమజ్జనంలో కూడా గతంలోలా పెద్దగా హడావుడి కనిపించడం లేదు. నిమజ్జనం కోసం భక్తులు ట్యాంక్‌బండ్‌ వైపు తరలివస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ లో వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్న చెరువుల వద్దా ప్రత్యేక ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles