'Mann Ki Baat' video gets over 5 lakh dislikes ప్రధాని 'మన్ కీ బాత్' కు డిస్ లైకుల తుపాను పోటెత్తింది..

Pm narendra modis mann ki baat video gets over 5 lakh dislikes on youtube

Mann Ki Baat, BJP, BJP YouTube, Narendra Modi, NEET Exam, JEE Exam, JEE, NEET, Narendra Modi Radio Show, Dislikes, comments, dogs, toys

#Mann_Ki_Nahi_Students_Ki_Baat started trending on Twitter soon after the episode was aired. Many on YouTube and Twitter questioned the Prime Minister for not addressing the issues JEE and NEET exams. One comment on Youtube reads, 'He (PM Modi) does not talk about employment, small enterprises and also education. You are the PM of India we don't need Mann Ki Baat...we need you to fulfill the duty for which we choose you.'

ప్రధానికి విద్యార్థిలోకం సెగ తగిలింది.. డిస్ లైకుల తుపాను పోటెత్తింది..

Posted: 09/01/2020 06:06 PM IST
Pm narendra modis mann ki baat video gets over 5 lakh dislikes on youtube

ప్రధాని నరేంద్రమోదీ ప్రతీ నెల వినిపించే ‘మన్‌ కీ బాత్’ కార్యక్రమం గత అదివారం రోజున వెలువడింది. అయితే ఈ మన్ కీ బాత్ కార్యక్రమానికి మునుపెన్నడూ లేని విధంగా అనుభవాలు ఎదురయ్యాయి. ప్రధాని ఈ ప్రసంగానికి సాధారణంగా డిస్ లైక్ లు రావడం తప్పనిసరి. అయితే ఇలా కొందరు చేయడంతో వారి వ్యతిరేకతను ప్రధానికి తెలిపేందుకు ప్రయత్నిస్తూ వుంటారు. అయితే డిస్ లైక్ ల కన్నా ప్రతీ సారి లైకులు సంఖ్య అందుకోలేని విధంగా వుంటుంది. కానీ ఈ సారి మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా డిస్ లైక్ లు వచ్చాయి. లైకుల కంటే డిస్ లైక్ లు ఆరింతలు ఎక్కువ కావడం గమనార్హం.

బీజేపీ యూట్యూబ్ చానల్ లో మోదీ ‘మన్‌ కీ బాత్’కు నిన్న రాత్రి వరకు మొత్తం 1.2 లక్షల లైకులు రాగా, డిస్ లైకులు మాత్రం 7.5 లక్షలు దాటిపోవడం గమనార్హం. అలాగే, 30 లక్షల మంది ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. ప్రధానమంత్రి యూట్యూబ్ చానల్ లోనూ ఈ కార్యక్రమానికి డిస్ లైక్ లు హోరెత్తాయి. ఇక్కడ 50 వేలకు పైగా లైక్స్ రాగా, 1.26 లక్షల డిస్ లైకులు వచ్చాయి. డిస్ లైకులపై కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం శ్రమిస్తున్న బీజేపీ తీవ్రంగా స్పందించింది. తమ నినాదం సాధ్యం కాదని తెలిసిపోయిందో ఏమో తెలియదు కానీ.. తమకు కొంత వ్యతిరేకత వచ్చినా.. అది కేవలం కాంగ్రెస్ పనేనని అనుమానాన్ని వ్యక్తం చేసింది.

ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానిని మునుపెన్నడూ లేని విధంగా డిస్ లైకులు రావడంతో అసలవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకున్న పార్టీ వర్గాలు.. వాటి‌ల్లో 98 శాతం విదేశాల నుంచే వచ్చాయని కనిపెట్టేశాయి. అంతేకాదు దేశంలోనే కనపించకుండా చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. విదేశాల్లో అత్యధికంగా బలాన్ని పుంజుకుందన్న సంకేతాలను ఇచ్చేలా.. ఈ డిస్ లైకుల వ్యవహారాన్ని కాంగ్రెస్ కు అంటగట్టగింది. ప్రధానమంత్రికి డిస్ లైకుల రావడం వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని ఆరోపించింది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదని బీజేపీ ఆరోపణలు చేసింది. ఇక దీన్ని బట్టి విదేశాల్లోనే ఇంతలా కాంగ్రెస్ గ్రాప్ పెంచుకుని వుందంటే.. ఇటు దేశంలోనూ కాంగ్రెస్ బలం పుంజుకోనుందన్న విషయాన్ని బీజేపి ఒప్పుకోకుండానే అంగీకరిస్తోందా.. అన్న ప్రశ్నలు కూడా ఉతప్పన్నమవుతున్నాయి.

కాగా, ఇంత పెద్ద సంఖ్యలో డిస్ లైకులు రావడం వెనుక విద్యార్థి లోకం ఆగ్రహం వుందని తెలుస్తోంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణకు కేంద్రం పూనుకోవడం, ఈ పరీక్షల గురించి మోదీ ప్రస్తావించక పోవడం విద్యార్థుల్లో ఆగ్రహాన్ని పెంచి, దాన్ని ఇలా డిస్ లైక్ ల రూపంలో చూపిందని తెలుస్తోంది. పలు రాష్ట్రాలు నీట్, జేఈఈ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని పట్టుబట్టినా, కేంద్రం సుముఖత వ్యక్తం చేయని సంగతి తెలిసిందే. దీంతో లక్షలాది మంది విద్యార్థులు, తమ అసంతృప్తిని ఇలా వ్యక్తం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో అత్యధికం, పరీక్షలను వ్యతిరేకిస్తూ ఉన్నవే కావడం గమనార్హం. కాగా, నేటి నుంచి ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ, పరీక్షలను సజావుగా ముగించేలా చూసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mann Ki Baat  BJP  BJP YouTube  Narendra Modi  NEET Exam  JEE Exam  JEE  NEET  Narendra Modi Radio Show  Dislikes  comments  dogs  toys  

Other Articles