(Image source from: English.sakshi.com)
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా తొంబై వేల మార్కును దాటింది. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఏకంగా మరణాలలో 710 మార్కును అందుకోవడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకే దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో ఇప్పటికే తెలంగాణ పదవ రాష్ట్రంలో నమోదు చేసుకుంది. ఈ తరుణంలో ప్రతి రోజు మరణాలు నమోదు కావడం కూడా అంధోళనకర అంశమే. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు వారి పనితీరుకు సవాల్ విసిరేలా తయరావుతున్నాయి.
తెలంగాణలో మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం అగడం లేదు. తాజాగా ఏకంగా 1682 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 235లకు పైగా కేసులు నమోదు కావడంతో నగరవాసుల్లోనూ ఆందోళనకు దారి తీస్తోంది.
గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఇవాళ కాసింత తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా తొంబై నాలుగు వేల మార్కును చేరింది, దీంతో ఈ స్థాయిలో కరోనా కేసుల నమోదు చేసుకున్న 7వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు అత్యధికంగానే నమోదువుతున్నాయి, ముఖ్యంగా వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ సహా పలు జిల్లాలలో పాజిటివ్ కేసుల నిర్తారణ అవుతున్నాయి, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 235 కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్ అర్భన్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికసంఖ్యలో నమోదయ్యాయి.
అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల తెలంగాణవాసులను కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో పంజా విసురుతున్న కరోనా.. ఇక జిల్లాల్లోనూ తన ఉద్దృతిని చాటుకుంటోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 94 మార్కును చేరువలో చేరింది, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ ఎనమిది మంది అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 711కు చేరింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఉగ్రరూపం దాల్చిన కరోనా కేసులు గత వారం రోజులుగా కాసింత తగ్గుముఖం పడుతున్నాయి. అయితే అదే సమయంలో జిల్లాల్లో వ్యాప్తి పెరుగుతోంది.
తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 1682 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 93,937 కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 235 కేసులు నమోదుకాగా, ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే అదిలాబాద్ జిల్లాలో 18, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 27, జగిత్యాలలో 59, జనగాంలో 32, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 19, జోగులాంబ గద్వాల జిల్లాలో 69, కామారెడ్డి జిల్లాలో 44, కరీంనగర్ జిల్లాలో 88, ఖమ్మం జిల్లాలో 45, కుమ్రంభీం అసిపాబాద్ జిల్లాలో 9, మహబూబ్ నగర్ జిల్లాలో 32, మహబూబ్ బాద్ జిల్లాలో 13, మంచిర్యాల జిల్లాలో 79, మెదక్ జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి,
ఇక మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 106, ములుగు జిల్లాలో 17, నగర్ కర్నూల్ జిల్లాలో 30, నల్గోండ జిల్లాలో 38, నారాయణ పేట్ 11, నిర్మల్ జిల్లాలో 27, నిజామాబాద్ 94, పెద్దపల్లి జిల్లాలో 59, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 47, రంగారెడ్డి జిల్లాలో 166, సంగారెడ్డిలో 18, సిద్దపేట జిల్లాలో 47, సూర్యాపేట జిల్లాలో 39, వికారాబాద్ జిల్లాలో 7, వనపర్తిలో 23, వరంగల్ రూరల్ జిల్లాలో 20, వరంగల్ అర్భన్ జిల్లాలో 107, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 కేసు నిర్థారణ అయ్యింది, కరోనా బారినపడిన బాధితులు కోలుకొన్న పలువురు రోగులను అధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తంగా 70,132 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,024 యాక్టివ్ కేసులు వున్నాయని, ఇక హోమ్ ఐసోలేషన్ లో 14,140 మంది చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more