Former India opener succumbs to COVID-19 టీమిండియా మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ కన్నుమూత

Former india opener chetan chauhan succumbs to covid 19

Chetan Chauhan, Former India opener, Indian cricketer, coronavirus, COVID-19, 40 tests, test cricket opener, vinayak chauhan, delhi, uttar pradesh, cricket, sports, sports news, cricket news, today cricket score, today match

Former India opener and UP minister Chetan Chauhan died on Sunday due to COVID-19 related complications, his brother Pushpendra Chauhan said. Chauhan, who played 40 Tests for India, was 73 and is survived by his wife and son Vinayak.

టీమిండియా మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ కన్నుమూత

Posted: 08/18/2020 02:29 AM IST
Former india opener chetan chauhan succumbs to covid 19

కరోనా వైరస్‌తో భారత మాజీ క్రికెటర్‌ చేతన్ చౌహాన్ (73) మృతి చెందాడు. జులై 12న ఈ వైరస్ బారినపడిన చేతన్ చౌహాన్.. తొలుత లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేరాడు. కానీ.. నిన్న ఉదయం అతని ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ మాజీ క్రికెటర్‌ కిడ్నీతో పాటు శరీరంలో మరికొన్ని అవయవాలు పాడవడంతో శనివారం నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ.. ఈరోజు సాయంత్రం అతను తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల్లో చేరిన చేతన్ చౌహాన్.. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ప్రస్తుతం కేబినెట్ మినిస్టర్‌గా ఉన్నాడు. కరోనాతో యూపీ కేబినెట్‌లో ఇది రెండో మరణం.

భారత్ జట్టులోకి 1969లో ఎంట్రీ ఇచ్చిన చేతన్ చౌహాన్ 40 టెస్టులాడి 2,084 పరుగులు చేశాడు. అలానే ఆడిన 7 వన్డేల్లో 153 పరుగులు చేశాడు. 1981లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన చౌహాన్.. కెరీర్‌లో కనీసం ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేకపోయాడు. కానీ.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడి దాదాపు 3000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్జున అవార్డు కూడా అందుకున్న చేతన్ చౌహాన్.. మహారాష్ట్ర, ఢిల్లీ తరఫున రంజీల్లో ఆడాడు. అతని కెరీర్‌లో 172 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chetan Chauhan  Former India opener  Indian cricketer  coronavirus  COVID-19  uttar pradesh  cricket  sports  

Other Articles