Heavy rains for Telangana for next five days: IMD హైదరాబాద్ లో ఎడతెరపి లేని వర్షం.. మరో ఐదు రోజులూ..

Rain lashed over telangana imd predicts more rains for next five days

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

With the Southwest Monsoon intensifying across Telangana, different parts of the city have been receiving heavy rainfall today since midnight, Which also led to traffic jams in the city. The widespread rains are likely to continue for the next five days under the influence of multiple weather systems persisting over the State and its neighbourhood.

హైదరాబాద్ లో ఎడతెరపి లేని వర్షం.. మరో ఐదు రోజులూ..

Posted: 08/13/2020 01:09 PM IST
Rain lashed over telangana imd predicts more rains for next five days

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని భారతీయ వాతావరణ కేంద్రం ముందస్తుగా చేసిన అంచానాల నిజమవుతుండటం ఒకింత సంతోషంగా వున్నప్పటికీ..  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం వరుసగా ప్రతీ రోజు వర్షం కురుస్తోంది. కాగా తాజాగా క్రితం రోజు అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్థంభించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ వర్షం ప్రభావం పడింది. వర్షం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సినవారు ఇళ్లకు పరిమితం అయ్యారు.

నగరంలో పూర్తిస్థాయిలో విస్తరించిన మేఘాలు ఎడతెరపి లేకుండా కురుస్తూనే వున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధ్రోణి ప్రభావంతో పాటు సముద్రమట్టానికి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తున వ్యాపించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షం విస్తారంగా కురుస్తోంది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, లక్డీకపూల్, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హిమాయత్‌ నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ సహా ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మైత్రీవనం, మియాపూర్, చందానగర్, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో గరిష్టంగా 4.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీనికి తోడు నగర పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లోనూ వర్షం భారీగా కురిసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఇక భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి.

వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఇవాళ, రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.  అలానే కొన్ని చోట్ల విద్యుత్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. కాగా గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లు అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసుకున్నాయి. జిల్లాలోని బూర్గపాడు ప్రాంతంలో ఏకంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇక భద్రచలం, అశ్వాపురం ప్రాంతాల్లో ఏకంగా 11 సెంటీమీటర్ల వర్షం నమోదైంది, హైదరాబాద్ వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు రాష్ట్రంలో విస్తారంగా కురిసి అవకాముందని తెలిపారు. రాష్ట్రంలో సాధారణ స్థాయిలోనే వర్షం నమోదవుతుందని తెలిపిన అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షపాతం నమోదు అవుతుందన్నారు. ఇక అత్యధిక వర్షపాతాన్ని అదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ (అర్భన్ రూరల్) మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గోండ, సూర్యాపేట్ జిల్లాలో నమోదైందని తెలిపారు.

ఇక ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని కూడా అధికారులు సూచించారు. నిన్న ఒక్క రోజునే రాష్ట్రంలో 533.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో అత్యధికంగా 807.6 వర్షపాతం.. నల్గోండలో అత్యల్పంగా 300.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రానున్న మరో మూడు రోజులు పాటు కూడా రాష్ట్రవ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles