11 killed as crane collapses at Visakhapatnam విశాఖలో మరో ప్రమాదం.. క్రేన్ కుప్పకూలీ 11 మంది మృతి

11 killed as crane collapses at hindustan shipyard in visakhapatnam

Hindustan Shipyard Limited, gaint crane collapsed, Visakhapatnam, 11 crushed to death, Andhra pradesh, Crime

11 people were crushed to death, while 1 person was injured after a crane collapsed in Andhra Pradesh on Saturday. The incident was reported from Hindustan Shipyard Limited in Visakhapatnam, DCP Suresh Babu confirmed.

విశాఖలో మరో ప్రమాదం.. క్రేన్ కుప్పకూలీ 11 మంది మృతి

Posted: 08/01/2020 11:20 PM IST
11 killed as crane collapses at hindustan shipyard in visakhapatnam

విశాఖ జిల్లా ప్రమాదాలకు ఖిల్లాగా మారుతోంది. ఇటీవలే రెండు గ్యాస్ లీక్ ప్రమాదాలు జరిగి పలువురి మరణాలను చవిచూసిన జిల్లాల్లో తాజాగా మరో విషాదం చోటుచేసుకంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనను ఆర్ఆర్ వెంకటాపురం సహా పరిసర గ్రామాల ప్రజలు మర్చిపోకముందే.. అనారోగ్యం బారిన పడ్డినవారు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోక ముందే మరో ఘటన సంభవించింది. విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్ యార్డులో ఘోర ప్రమాదం సంభవించింది. యార్డులోని భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

భారీ క్రేన్‌ పనిచేస్తున్న తీరుపై అనుమానాలు వచ్చిన సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలినట్లు సమాచారం. దీంతో క్రేన్ పరిశీలిస్తున్న సిబ్బందితో పాటు.. క్రేన్‌ కింద వున్న పలువురిపై క్రేన్ పడటంతో పలువురు మరణించారు. అయితే క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్రేన్‌ వద్ద 15 మందికిపైగా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ భారీ క్రేన్ ను ఇటీవల హిందుస్థాన్‌ షిప్ యార్డ్‌ కొనుగోలు చేసింది. దీని నిర్వహణను ఇటీవలే పొరుగు సేవల సిబ్బందికి అప్పగించారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా..

 

హిందుస్థాన్ షిప్ యార్డులో చోటుచేసుకున్న ప్రమాదఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరా తీశారు. ప్రమాదంలో గాయాలతో బయటపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. షిప్ యార్డ్ వద్ద రక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. కాగా మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించనున్నారని సమాచారం. కాగా సంస్థ నుంచే పరిహారాం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles