Nod for inter-state travel in Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ కావాలా.. అయితే ఈ-పాస్ ఉందా.?

Unlock 3 0 nod for inter state travel in andhra pradesh

unlock 3.0, state home department, containment zones, four wheelers, goods carriers, passengers, state border, E-pass, Andhra Pradesh

The Andhra Pradesh home department on Saturday issued revised guidelines for Unlock 3.0 - from August 2 removing restrictions on inter-state travel and movement of persons and goods within the state.

ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ కావాలా.. అయితే ఈ-పాస్ ఉందా.?

Posted: 08/01/2020 11:14 PM IST
Unlock 3 0 nod for inter state travel in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ లాక్ 2 నుంచి రాత్రి పూట ప్రయాణాలకు కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆంక్షలు విధించింది. పోరుగు రాష్ట్రాల ప్రయాణాలకు కూడా అనుమతించలేదు. తమ రాష్ట్రంలోకి ఎవరు వచ్చినా అంక్షలు అమల్లో వుంటాయని తేల్చిచెప్పింది. ఇక తాజాగా అన్ లాక్ మూడు కూడా అమల్లోకి రానున్న నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల అనుమతి నిబంధనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సడలింపులు చేసింది. అన్ లాక్‌ 3 నిబంధనల మేరకు వీటిని సడలించినట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆటోమెటిక్‌ ఈపాస్‌ జారీకి నిర్ణయించారు. స్పందన వెబ్ సైట్ లో పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈపాస్‌ జారీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రయాణికుడి మొబైల్‌, ఈమెయిల్ కు పాస్‌ పంపనున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఈపాస్ తోపాటు గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఆదివారం అనగా ఆగస్టు 2 నుంచి ఆటోమేటిక్‌ ఈపాసులు జారీ చేయనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. చెక్ పోస్టుల వద్ద నమోదు చేసుకున్నవారి వివరాలను స్థానిక సిబ్బందికి ఇస్తామని చెప్పారు. అయితే ఈ పాస్ లు లేని వారిని, వారి వాహనాలను రాష్ట్రంలోని అనుమతించబోమని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉద్దృతి శరవేగంగా చాటుకుంటున్న తరుణంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, వాటిలో ఈ పాస్ లు కూడా ఓ భాగమేనని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles