Raghurama Raju appeals people to forgive him సిగ్గుతో తలదించుకుని క్షమాపణలు కోరుతున్నా: రఘురామ కృష్ణంరాజు

Raghurama krishnam raju appeals his constituency people to forgive him

Raghurama Krishnam Raju, YSRCP rebel MP, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju YCP notices, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju showcause notice, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

YSRCP 'rebel' Lok Sabha member Raghurama Krishnam Raju yet again displayed what he is good at sarcasm. Raju, appealed to Chief Minister Y S Jagan Mohan Reddy to lead by example in the state’s combat against the pandemic.

సిగ్గుతో తలదించుకుని క్షమాపణలు కోరుతున్నా: రఘురామ కృష్ణంరాజు

Posted: 07/27/2020 10:03 PM IST
Raghurama krishnam raju appeals his constituency people to forgive him

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కరోనా మహమ్మారిపై పోరును సాగిస్తున్నారని ఈ క్రమంలో అమరావతి నుంచి అట్టహాసంగా వెయ్యికి పైగా అంబులెన్సులను ప్రారంభించి ప్రత్యర్థి పార్టీల ప్రశంసలు కూడా అందుకున్నారన్న అన్నారు. కానీ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన అంబులెన్సు సేవలు నిజంగా రోగుల అవసరానికి ఉపయోగపడటం లేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన సొంతూళ్లో కరోనా బాధితుడుని చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్లడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన సొంత ఊర్లో ఈ ఘటన జరగడంతో సిగ్గుతో తల దించుకుంటున్నానని... ప్రజలు తనను క్షమించాలని అన్నారు.

అంబులెన్సులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి మీడియా తీసుకెళ్లాలని విన్నవించారు. రాష్ట్రంలో కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో చర్చించానని రఘురాజు చెప్పారు. కరోనా కేసుల్లో దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుందని... రానున్న రోజుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందని తెలిపారు. యాంటీ బాడీ టెస్టులు ఆలస్యమవుతున్నాయని... టెస్ట్ ఫలితాలు ఏడు రోజుల తర్వాత వస్తున్నాయని... ఈ లోపల వైరస్ విస్తరిస్తోందని చెప్పారు.

ఎంపీలు, అధికారులతో ముఖ్యమంత్రి వెబ్ సెమినార్ సమావేశం చేయాలని... ప్రతి రోజు మూడు జిల్లాల వారితో మాట్లాడాలని రఘురాజు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అతి పెద్ద సమస్య కరోనానే అని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది మాస్కులు లేకుండా  తిరుగుతున్నారని... సాక్షాత్తు ఎంపీలు కూడా కరోనా బారిన పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఆయుర్వేదం చదివిన 8 వేల మంది డాక్టర్లు ఉన్నారని... వారి సేవలను కూడా వినియోగించుకోవాలని  చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాలనే వ్యాఖ్యలను పక్కన పెట్టి, దాన్ని అరికట్టడానికి యత్నించాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles