Omar Abdullah will not contest J&K elections జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం సంచలన ప్రకటన..

Omar abdullah says he will not contest elections till jammu and kashmir remains a ut

Omar Abdullah not to contest in elections, Jammu And Kashmir UT Elections, Jammu and kashmir elections, jammu Union territory Elections, Article 35, Omar Abdullah. Jammu And Kashmir, Elections, Article 370, Union Territory, Jammu and Kashmir Politics

Former Jammu and Kashmir Chief Minister and National Conference (NC) leader Omar Abdullah, who was released from a prolonged detention some time back, has said that he will not contest assembly elections till the time J&K remains a Union Territory.

ఎన్నికలలో పోటీపై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం సంచలన ప్రకటన..

Posted: 07/27/2020 09:18 PM IST
Omar abdullah says he will not contest elections till jammu and kashmir remains a ut

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించారు. జమ్మూకాశ్మీర్.. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ రద్దు వంటివి తమను పూర్తిగా ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలతో నిజం చెప్పాలంటే తాము షాక్ కు గురయ్యామని అన్నారు. కేంద్రం ఈ నిర్ణయంతో కశ్మీరీలను తీవ్రంగా అవమానించిందని, ప్రజలకు ఒక రకంగా శిక్ష విధించిందని మండిపడ్డారు.

అసలు జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడమేంటో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని అన్నారు. తాను అత్యధిక కాలం శాసనసభలో ఉన్నానని, ఆరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించానని, అలాంటి సభలో ముఖ్యమంత్రిగా వున్న తాను.. కేంద్రంలో చేక్కుచేతుల్లోకి వెళ్లిన శాసనసభలో సభ్యుడిగా కూడా మనజాల లేనని అన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజా నాయకుడిగా ఉండి అన్ని విపత్కర పరిస్థితులు చుట్టుముట్టినా రాష్ట్రాన్ని ముందుకు నడిపించానని పేర్కొన్న ఒమర్.. ఇంత బలహీనమైన, అధికారంలో లేని సభలో సభ్యుడిగా ఉండలేనని తేల్చి చెప్పారు. రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.

జమ్మూకాశ్మీర్ లో సమూల మార్పులు చేసే ఆగస్టు 5వ తేదీకి ముందు కొంత మంది తమ నేషనల్ కాన్పరెన్స్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులతో ప్రధాని సమావేశమయ్యారని, అయితే అది సమవేశం కాదని దాని గురించి తాను మరోమారు వివరణాత్మకంగా వ్యాసం రాస్తానని చెప్పారు. కాగా, ఇలా సమావేశమయిన 72 గంటలకు ఏం జరుగుతుందో కూడా తెలియకముందు తమను గృహనిర్భంధాల్లో వుంచి రాష్ట్రంలో తాము అనుకున్నది అమలు చేశారని అన్నారు. దేశ సమగ్ర అభివృద్దిలో తాము భాగమయ్యామని కానీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీ అర్టికల్ 370ని మాత్రం అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ఇది సముచిత చర్య కాదని కూడా ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles