Want an Assembly session, says Ashok Gehlot రాజ్ భవన్ లో గెహ్లాట్ వర్గం బైఠాయింపు

Rajasthan crisis cm ashok gehlot says governor acting under centres pressure

sachin pilot, Rajasthan Political Crisis, Ashok Gehlot, rajasthan governor, Kalraj Mishra, Sachin pilot, ashok gehlot, AShok loyalists, Rahul Gandhi quit Congress chief, Rebel Congress leader Sachin Pilot, Sachin Pilot sacked, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan, politics

Rajasthan chief minister Ashok Gehlot, after questioning the delay in calling the assembly session, arrived in four buses with his MLAs from the luxury resort to the state governor Kalraj Mishra's residence. The CM has been pressing for an assembly session to discuss coronavirus and the political situation in the state.

అసెంబ్లీని సమావేశపర్చాలంటూ రాజ్ భవన్ లో గెహ్లాట్ వర్గం బైఠాయింపు

Posted: 07/24/2020 10:01 PM IST
Rajasthan crisis cm ashok gehlot says governor acting under centres pressure

రాజస్థాన్‌ రాజకీయం మళ్లీ రాజుకుంటోంది. గత కొన్ని రోజులుగా క్యాంపు రాజకీయాల్లో నిమగ్నమై ప్రత్యర్థి పార్టీల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో వున్నా అధికార పక్షం.. ఇక తమకు తగిన సంఖ్యా బలం వుందని.. దానిని శాసనసభలో నిరూపించుకునేందుకు కూడా తాము సిద్దమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని గవర్నర్ ను కోరుతున్నా ఆయన ప్రకటనను వెలువరించకపోవడంతో ఏకంగా తన వర్గం ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ అధికార నివాసం ఎదుట భైఠాయించారు. దీంతో తాజా పరిస్థితి ప్రకారం గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్న రీతిగా పరిణామాలు మారాయి.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లాట్ ఇవాళ గవర్నర్‌ కల్ రాజ్‌ మిశ్రాను కలిశారు. అసెంబ్లీని సమావేశ పరచాలని కోరారు. అదే సమయంలో ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌ బయట ఆందోళన చేస్తూ.. తక్షణమే అసెంబ్లీని సమావేశ పర్చాలంటూ నినాదాలు చేస్తున్నారు. అనర్హత పిటిషన్లపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీని సమావేశ పరిచి బలపరీక్ష నిర్వహించాలని గహ్లాట్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ పిలుపునిచ్చే వరకూ తాము ఆందోళన విరమించబోమని తేల్చిచెప్పారు. దీంతో రాజ్ భవన్ వద్ద హైడ్రామా నెలకొంది. అయితే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో గహ్లాట్ అసంతృప్తి వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోందని, ఈ క్రమంలో తాజా పరిస్థితులపై అసెంబ్లీలో చర్చించాలని కోరానని అన్నారు. అసెంబ్లీలో తన సంఖ్యా బలాన్ని కూడా నిరూపించుకుంటానని ఆయన చెప్పారు, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, తమకు కావాల్సిన సంఖ్య కన్నా అధికంగానే బలముందని ఆయన చెప్పారు. నిన్నటి నుంచి గవర్నర్ ను ఈ విషయమే కోరుతున్నామని.. అయినా ఆయన స్పందించకపోవడం గర్హనీయమన్నారు. అయితే ఆయన అసెంబ్లీకి అనుమతించకపోవడానికి పై నుంచి వస్తున్న ఒత్తిడి కూడా కారణంగా అనిపిస్తోందని అనుమానాం వ్యక్తం చేశారు. గవర్నర్‌ అనే వ్యక్తి రాష్ట్ర కేబినెట్‌ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలలే కానీ.. కేంద్రం చెప్పినట్టల్లా ఆడరాదని అన్నారు. దేశంలో ఇంత వరకూ ఎవరూ అసెంబ్లీని సమావేశపరచడానికి అనుమతి నిరాకరించలేదని గెహ్లాట్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles