Setback to YSRCP Government in SC సుప్రీంకోర్టులోనూ జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..

Reinstate ramesh kumar by july 31 supreme court to ap govt

Setback to YSRCP Government, Nimmagadda Ramesh Kumar, High court contempt of the court, supreme court, Ramesh kumar, SEC, state election commissioner, AP High Court, YSRCP Government, Bishwabhushan Harichandan, Governor, Andhra Pradesh, politics

For the fourth time in less than a month, the Supreme Court on Friday yet again refused to give a stay on the Andhra Pradesh High Court order over reinstatement of Nimmagadda Ramesh Kumar as State Election Commissioner.

సుప్రీంకోర్టులోనూ జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. నిమ్మగడ్డకు వారం గడువు

Posted: 07/24/2020 09:36 PM IST
Reinstate ramesh kumar by july 31 supreme court to ap govt

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి మరోమారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారించిన న్యాయస్థానం అందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల అదికారి నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని రాష్ట్రంలోని జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం వినతి మేరకు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రభుత్వానికి చుక్కెదురైంది.

కాగా నిమ్మగడ్డ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని ప్రభుత్వం.. న్యాయస్థానం జారీ చేసిన కోర్టు ధిక్కార ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేయటం లేదని హరీశ్‌ సాల్వే వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చులకన భావంగా పరిగణిస్తూ.. అధికార పార్టీ నేతలు సోషల్‌ మీడియాలో తద్భిన్నంగా వ్యాఖ్యలు చేశారని కూడా సాల్వే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వాలు చేసే పనేనా అంటూ సర్కార్ వెర్రి వేషాలను నిలదీశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘నిమ్మగడ్డ కేసు విషయానికి సంబంధించి తమకు ప్రతి విషయం తెలుసునని న్యాయస్థానం చెప్పింది. ఈ కేసులో తాము కావాలనే స్టే ఇవ్వట్లేదని పేర్కోంది. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌ కుమార్ కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత దారుణంగా అభిప్రాయపడింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోరా.. గవర్నర్ తో కూడా చెప్పించుకోవాలా? అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గతంలో నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే.. అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్‌ దాఖలు చేస్తామని హరీశ్‌ సాల్వే కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పిటిషన్‌ పై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజుల గడువు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  Ramesh kumar  SEC  AP High Court  YSRCP Government  AP Governor  Andhra Pradesh  politics  

Other Articles