Pawan Kalyan Slams Andhra Govt over 3 capitals 3 రాజధానులతో భూములిచ్చిన రైతులకే నష్టం: పవన్ కల్యాణ్

Farmers who gave land for development of capital now crying pawan kalyan

Janasena, pawan kalyan, pawan kalyan on 3 capital, decentralisation, development, capital city, farmers, thousands acres of land, cultivational land, janasena social media, Telugu Desam Party’s Singapore model, house site pattas, manipulations, visakhapatnam, Vijayawada, Andhra Pradesh, politics

JanaSenaParty chief Pawan Kalyan said the ruling YSRCP, when campaigning in opposition, should have promised to set up three capitals for Andhra Pradesh. Kalyan said farmers would not have given thousands of acres of their land for the development of the capital city and their tears are not good for rulers.

మూడు రాజధానులతో భూములిచ్చిన రైతులకే నష్టం: పవన్ కల్యాణ్

Posted: 07/24/2020 12:27 AM IST
Farmers who gave land for development of capital now crying pawan kalyan

ఏపీలో మూడు రాజధానుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా కొనసాగుతోంది. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అనేది ఓ కలేనని పేర్కొన్నారు. పాలనా, అభివృద్దికి రాష్ట్రానికి సరిపడా నిధులే లేవని ప్రభుత్వాలకు తెలిసినా.. సింగపూర్ మోడల్ తరహా రాజధాని పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం వేల ఎకరాలను ల్యాండ్ పుల్లింగ్ ద్వారా రైతుల నుంచి తీసుకున్నదని అన్నారు. ఇప్పుడు కూడా అధికారంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి.. ఒకేసారి అభివృద్ది ఎలాచేస్తారని, అది సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు.

అభివృద్ధి అన్ని చోట్లా జరగాల్సిందేనని, కానీ రాజధానులుగా విడగొట్టడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్నది ఓ కాన్సెప్ట్ మాత్రమేనని.. అది కూడా ఇకపై కలేనని పేర్కొన్నారు. గతంలో టీడీపీ నేతలు సింగపూర్ లాంటి రాజధాని అంటూ కాన్సెప్ట్ ను ఎలా అమ్ముకున్నారో, ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అధికార వికేంద్రీకరణ అంటూ మరో కాన్సెప్ట్ ను అమ్మడం తప్ప, రాష్ట్రప్రజలకు నిజమైన వాస్తవాన్ని చెప్పడం లేదు.. వాస్తవికతను చూపించడం లేదని పవన్ విమర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రతిపాదించినప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఎందుకు అడ్డుకోలేకపోయిందని.. ఎందుకు అంగీకారం తెలిపిందని ప్రశ్నించారు.

ఇక దీనికి తోడు అప్పుడే తాము మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఉంటే రైతులు ఇన్నేసి ఎకరాలు ఇచ్చేవారు కాదని పవన్ స్పష్టం చేశారు. రైతులు నాడు భూములు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి అని పేర్కొన్న పవన్... టీడీపీ-వైసీపీ ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ నాటి టీడీపీ ప్రభుత్వ నిర్ణయంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి ఇన్నేసి ఎకరాల భూములు తీసుకుని సింగపూర్ లాంటి రాజధాని కట్టాలంటే మనకు సింగపూర్ తరహా వ్యవస్థ ఉండాలని, లీకాన్ యూ వంటి వ్యక్తి ఉండాలని స్పష్టం చేశారు.

అక్కడ అన్ని జాతుల వారు సింగపూర్ వాళ్లే అనే భావన తీసుకువచ్చారని, అంతటి గొప్పమనసు, ఉన్నతమైన రాజకీయ విధానం ఇక్కడ మనకు లేవని తెలిపారు. అంతంత స్థాయిలో భూములు తీసుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందని అప్పుడే చెప్పానని, కానీ ఈ రోజున నిజంగానే రైతులు నష్టపోతున్నారని వివరించారు. పేదలకు ఇళ్ల పట్టాలను పంఫిణీ కార్యక్రమంపై ఆయన తన మనోభావాన్ని తెలిపారు. అయితే మధ్యవర్తులకు మేలు చేసేలా తక్కువ ధర భూమిని కూడా నాలుగైదింత అధిక ధరకు తీసుకుని మధ్యవర్తులకు లాభం చేకూర్చారని అరోపించారు.

తన దృష్టికి ఇలాంటి ఘటనలు వచ్చాయని పేర్కోన్నారు. అవినీతి, అక్రమాలకు అస్కారం లేకుండ పాలనను అందిస్తామంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. ఇక ఈ పట్టాల పంఫిణీ విషయంలోనూ తమ పార్టీ నేతలు సూచించిన వారికి మాత్రమే పట్టాలు అందుతున్నాయని, నిజమైన పేదలకు, అర్హులకు మాత్రం అందడం లేదని అన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులంటూ కొందరు పేదలను పక్కనబెడుతున్నారని అలాంటి తారతమ్యాలకు అస్కారం లేకుండా అర్హులైన పేదలందరికీ పట్టాలను పంపిణీ చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles