Conspiracy To Topple Rajasthan Govt, Says Ashok Gehlot ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. రూ.2000 కోట్లతో బీజేపి పందేరం..

Conspiracy to topple rajasthan govt says ashok gehlot fir mentions differences

Ashok Gehlot, Sachin Pilot, Rajasthan government, Toppling Ashok Gehlot government in Rajasthan, Congress, BJP, Secret tape on toppling Rajasthan government, FIR on conspiracy to topple Rajasthan government, Rajasthan Police, Rajasthan politics, Differences between Gehlot and Pilot, Rajya Sabha election

A phone conversation was unraveled after police put two phone numbers under surveillance in connection with arms smuggling. However, the conversation revealed a conspiracy to topple Ashok Gehlot-led Congress government In Rajasthan, police said.

రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. రూ.2000 కోట్లతో బీజేపి పందేరం..

Posted: 07/12/2020 12:23 AM IST
Conspiracy to topple rajasthan govt says ashok gehlot fir mentions differences

రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. సిగ్గు లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెర వెనుక కుట్రలు సాగుతున్నాయని అరోపించారు. ఈ మేరకు కేంద్రంలోని అధికార పార్టీ సహకారంతో రాష్టరంలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయిన ఆయన ఆ పార్టీపై మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన తాను ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితుల మీద చర్చించేందుకు మీ ముందుకు వచ్చానని చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నా. కానీ, బీజేపీ మాత్రం మానవత్వం మరిచిపోయి వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే దేశ ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్లలో వుంటే బీజేపి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ‘కొంతమంది సిగ్గులేని వాళ్లు ఉంటారని. సిగ్గుకి కూడా ఓ పరిమితి ఉంటుందని అది కూడా దాటి వారు వ్యవహరిస్తూన్నారని మండిపడ్డారు. అయితే ప్రజల ముందుకు వచ్చిన సందర్భంలో మాత్రం వీరు నీతి సూక్తులు బాగా వల్లిస్తారని ఆయన చురకలు అంటించారు. గుజరాత్ లో ఏడుగురు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లి రెండు సీట్లు సాధించారు. ఇక్కడ కూడా అలాగే చేయడానికి ప్రయత్నించారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు సహకారంతో మేం రెండు సీట్లు సాధించాం. ఆ సిగ్గులేని వాళ్లు ఇంకా పాత టెక్నిక్ లు వాడుతూనే ఉన్నారని గెహ్లాట్ అన్నారు.

రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో తాజాగా ఇద్దరు బీజేపీ నేతలను ఎస్ఓజీ అధికారులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వారి సంభాషణల్లో ఉందని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని, సీఎంను పార్టీ హైకమాండ్ ఎంపిక చేస్తుందని చర్చించుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు ముందే ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేశారంటూ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, 5 - 10 రోజుల్లో ప్రమాణస్వీకారం చేసే అవకాశం కూడా ఉందనేలా సంభాషణలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan CM  Ashok Gehlot  PM modi  Amit Shah  Sachin Pilot  phone conversation  Congress  BJP  politics  

Other Articles