AP to follow NCERT on alternative calendar ఏపీలో స్కూల్స్ రీ-ఓపెనింగ్‌పై విద్యాశాఖ కీలక ప్రకటన

Education department makes crucial statements on schools re opening

ap academic calendar, NCERT, AP academic calendar updates, ap academic calendar news, andhra pradesh school education department, academic calendar, Education news, schools update, schools reopen news, Educational institutions, Andhra Pradesh

The Andhra Pradesh school education department has decided to follow the guidelines issued by the National Council of Education Research and Training (NCERT) with regard to the alternative academic calendar till the time schools reopen.

ఏపీలో స్కూల్స్ రీ-ఓపెనింగ్‌పై విద్యాశాఖ కీలక ప్రకటన

Posted: 07/11/2020 07:20 PM IST
Education department makes crucial statements on schools re opening

కరోనా కల్లోలంతో ప్రపంచం మొత్తం స్థంభించే పరిస్థితులు ఉత్పన్నం కాగా, ప్రైవేటు పాఠశాలలు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూన్నాయి. ఓవైపు పాఠశాలు విద్యార్థుల ఫీజులను పెంచుతూ వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టడంతో పాటు మరోవైపు ఆన్ లైన్ తరగతులను ప్రారంభించాయి. ఇక మరికొన్ని పాఠశాలలు అప్పుడే ఇంటర్నల్ పరీక్షలకు కూడా తెరలేపాయి, దీంతో ఇప్పటికే పలువురు తల్లిదండ్రులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఇవాళ ఈ విషయమై తీవ్రంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక అదేశాలను జారీ చేసింది. స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై కానీ లేక ఫీజులపై కానీ పాఠశాలలు ఎలాంటి ప్రకటనలు చేయరాదని స్పష్టం చేసింది.

స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే అంశంతో పాటు విద్యా క్యాలెండర్ రూపొందించి, పాఠ్యాంశాల కుదింపు వరకూ అన్నీ ఎన్సీఈఆర్టీ జారీ చేసిన అదేశాల ప్రకారమే నడుచుకోవాలని సూచించింది. విద్యాశాఖ ప్రకటన చేసేంతవరకూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయరాదని ఆదేశించింది. ఇక విద్యార్థులకు అప్పుడే ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న పిర్యాదులు కూడా అందాయని, ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా స్కూల్స్ ఓపెన్ చేయకూడదని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రీజినల్ జాయింట్ డైరెక్టర్‌లు, డీఈఓలు ప్రత్యేక నిబంధనల అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

‘విద్యార్థులకు పరీక్షలు మార్కులు, ర్యాంక్‌లు ఇవ్వకూడదు. ప్రత్యామ్నాయ విద్యా సంవత్సర క్యాలెండర్ ను ఎన్సీఈఆర్టీ సిద్ధం చేసింది. దానినే అన్ని స్కూళ్ల పాటించాలని అదేశించారు. ఆన్ లైన్ అభ్యాసం కొనసాగించడాన్ని ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం ఆన్లైన్ క్లాస్ లు నిర్వహించి ఫీజులు చెల్లించమంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇంకా అకడమిక్ క్యాలెండర్ తయారు కాలేదు. పనిదినాలు, సిలబస్ తగ్గింపు ద్వారా విద్యార్థుల అభ్యాసంపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. టీచర్లు, సోషల్ మీడియా, టెక్నాలజీ సాయంతో అకడమిక్ విద్యను పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు విద్యార్థులకు అందించాలి. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ 8 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ను ప్రాథమిక విద్యకు విడుదల చేసింది’ అని చిన వీరభద్రుడు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles