Visakha experts Corona mask-99 కరోనాకు చెక్ పెట్టే నానో మాస్క్ అవిష్కరణ

Visakha experts innovates nano photenic filter mask 99 to keep check on corona

Nano Photenic Filter Mask 99, Visakha experts innovation, visakha experts mask-99, coronavirus, covid-19, ICMR, NDRC, new innovation, corona mask

Visakha experts innovates Nano Photenic Filter Mask 99 to keep check on corona, ICMR and NDRC to give authentication on new innovation

కరోనాకు చెక్: నానో మాస్క్ ను ఆవిష్కరించిన విశాఖ నిపుణులు

Posted: 07/08/2020 09:52 PM IST
Visakha experts innovates nano photenic filter mask 99 to keep check on corona

(Image source from: m.eenadu.net)

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ లక్ష్లాది మంది ప్రాణాలను ఇప్పటికే కబళించివేసింది, ఇది చైనా పుట్టించిన ప్లేగ్ లాంటిదని అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసినా.. కాదు ఇది ముమ్మాటికి చైనా బయో వెపన్ అని మరోకరు అరోపించినా.. కరోనా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఈ మహమ్మారి జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్న క్రమంలో ఇంట్లోంచి బయటకు అడుగుటు వేయాలంటేనే భయాందోళనకు గురవుతున్న ప్రజలు, అయితే కరోనా నుంచి రక్షణ పోందేందుకు మాస్క్ తప్పనిసరని పోలీసులు సూచిస్తున్నారు, మాస్క్ లేకపోతే పోలీసులు ఏకంగా ఫైన్ వైస్తున్నారు. ఈ క్రమంలో యాభై రూపాయల నుంచి వేల రూపాయల వరకు మాస్కులు పెట్టుకోచ్చాయి,

కానీ వాటిలో నిజంగా వాటిని వాడే పరిస్థితులను కల్పించిన మహమ్మారి నుంచి రక్షణ కల్పించే నాణ్యత వున్నవి ఏవీ అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం కాక తప్పవు, ఈ క్రమంలో మెరుగైన రక్షణ కల్పించే మాస్క్ ను విశాఖకు చెందిన సాంకేతిక నిపుణులు ఆవిష్కరించారు. అదే మాస్క్-99. ఐదు లేయర్ల నానో ఫోటానిక్ టెక్నాలజీతో అదే తరహా ఫిల్టర్ ను కూడా ఇమిడివున్న మాస్క్ ఇది. మరోలా చెప్పాలంటూ ఎన్‌-95 మాస్క్ కంటే ఇదే అధిక ప్రయోజనకారి అని దీనిని రూపోందించిన నిపుణుల అభిప్రాయం. దీనిని దాటి ధరించినవారిలోకి వైరస్ 99శాతం మేర చేరదు.

అంతేకాదు ఇది ధరించివారి ముఖం, మెడ, తల, చాతి పైనున్న వైరస్ ను కూడా ఈ మాస్క్ అకర్షించి మరీ చంపేస్తుంది, ప్రస్తుతం ఈ మాస్క్ ఇండియన్ మెడికల్ అండ్ రిసర్చ్ కౌన్సిల్ తో పాటు జాతీయ రిసర్చ్ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లకు తయారీదారులు పంపారు, దీనినితో పాటు దానిని రూపోందించిన విధానం, దాని ప్రయోజనాలతో కూడిన నివేదికలను కూడా పంపారు. ఐసీఎంఆర్, ఎన్ఆర్డీసీ పరిశీలించి.. మాస్క్ 99కు అనుమతులు ఇవాల్సివుంది. అనుమతులు లభించిన వెంటనే రాష్ట్రంలో ప్రోడక్షన్ ప్రారంభిస్తామని రూపకర్తలు తెలిపారు,

మస్క్ 99ను రూపకర్తలు ఎవరు.?

 

మాస్క్ 99 ఐడియా వచ్చిన రూపకర్తలు మాస్క్ అనగానే ఇవాళ బజారులో లభిస్తున్న చెత్త మాస్కులను ధరించి కూడా లాభం లేదని అభిప్రాయానికి వచ్చారు. దీంతో కరోనా వైరస్ లాంటి వైరస్ లను శరీరంలోకి వెళ్లనీయకుండా రక్షణ కవచంలా వుండే మాస్క్ ను రూపోందించాలని, తొలిదశలనే మాస్ వైరస్ ను చంపేసేలా మాస్క్ లను రూపోందించాలని బలమైన సంకల్పమే వారిలో దీని తయారీపై అడుగులు వేసేట్లు చేసింది, ఢిల్లీ ఐఐటీలో ఎంటర్ ప్రెన్యూర్‌ సెల్‌ విభాగ మాజీ సభ్యుడు కేవీ రమణ, ఆంధ్ర విశ్వవిద్యాలయ జియో ఇంజినీరింగ్‌ విభాగంలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో డాక్టర్‌ దేముడు, ఎం.ఎస్‌.ఆర్‌.లెదర్‌ ఇండస్ట్రీకి చెందిన శేషగిరిరావులు ఈ మాస్కులను తయారు చేశారు. దీనికి ‘నానో ఫొటానిక్‌ ఫిల్టర్‌ (ఎన్‌.పి.ఎఫ్‌.) మాస్క్‌-99’ అని పేరు పెట్టారు. వీరు కొన్ని నమూనా మాస్క్‌లను రూపొందించారు.

మాస్క్ 99ను ఎలా రూపోందించారు.?

 

మాస్క్‌-99 కు ఐదు పొరలతో రూపోందించారు. మొదటిపొరలో సింథసైజ్డ్‌ నానో మెటాలిక్‌ పదార్థాలను కోటింగ్ గా వినియోగించారు. రెండో పొరలో సింథసైజ్డ్‌ ఫొటానిక్‌ ఉంటుంది. ఫొటానిక్‌ కారణంగా సమస్యలు తలెత్తకుండా మూడోదశలో రక్షణ పొరను ఉంచారు. వీటి తరువాత సింథసైజ్డ్‌ నైలాన్‌ ఫ్యాబ్రిక్‌ పొర, కాటన్‌ సింథసైజ్డ్‌ ఫ్యాబ్రిక్‌ పొరలు ఉంటాయి. వీటన్నింటినీ దాటి గాలిలోని బ్యాక్టీరియాలు, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశాలు 99 శాతం వరకు తగ్గుతాయి. వైరస్‌, బ్యాక్టీరియా ఆ మాస్క్‌లోకి చొచ్చుకొస్తే పొరలపై ఉండే పదార్థాల కారణంగా చనిపోతాయి. మాస్క్ కు ఒక సింథసైజ్డ్‌ ఫొటానిక్‌ బ్లూలైట్‌ను అమర్చారు. ఇది ముఖంపై మాస్క్‌ ఆచ్ఛాదన లేని భాగాలపై ఉండే క్రిములను ఆకర్షించి మాస్క్‌ ఉపరితలానికి వచ్చేలా చేస్తుంది. పైకి వచ్చిన వెంటనే అవి చనిపోతాయి. మాస్క్‌లో ఒక నానో చిప్‌, నానోబ్యాటరీ ఉంటాయి. గంటపాటు ఛార్జి చేస్తే 8 గంటలు బ్యాటరీ పని చేస్తుంది. మాస్క్‌ను 6 నెలలపాటు నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. సింథసైజ్డ్‌ నైలాన్‌ ఫ్యాబ్రిక్‌ పొర, కాటన్‌ ఫ్యాబ్రిక్‌ పొరలను బయటకు తీసి శుభ్రం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles