Railway Employee Hounds Out creditors With His Dogs! పీవీపీ బాటలో రైల్వే ఉద్యోగి.. రుణదాతలపైకి కుక్కలు..

Railway employee of amaravati follows footsteps of pvp letting the dogs run loose onto police

YSRCP leader, Potluri Vara Prasad, Maddhuru, Ramavath champalli, rasoolpeta, Railway Employee, Creditor, PVP, dogs, Amaravati, Andhra Pradesh, crime

Yet another incident has been registered at Amaravati Mandal Rasoolpeta where a Railway Employee has followed the footsteps of veteran film producer and YSR Congress Party leader Potluri Vara Prasad, allegedly for leaving the domestic dogs on to the Creditor.

పీవీపీ బాటలో అమరావతి రైల్వే ఉద్యోగి.. అప్పుచెల్లించమంటే కుక్కలు..

Posted: 07/08/2020 09:04 PM IST
Railway employee of amaravati follows footsteps of pvp letting the dogs run loose onto police

ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత వరప్రసాద్ (పీవీపీ) అడుగుజాడల్లో నడిచాడు అమరావతికి చెందిన ఓ రైల్వే ఉద్యోగి. అదేంటి పివీపీ అడుగుజాడల్లో నడవడమేంటని అలోచనలో పడ్డారా.? అదేం లేదండీ.. మన నాయకులు చూపిన దారిలో ప్రజలు ఫాలో అవ్వడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఈ రైల్వే ఉద్యోగి మాత్రం తదనంతర పరిణామాలను పట్టించుకున్నట్లు లేదు. అందుకనే ఆయన చేసిన పనినే ఈయనా చేశాడు కానీ పర్యవసానాలు అలోచించలేదు. దీంతో ఈ రైల్వే ఉద్యోగి కూడా ప్రస్తుతం పోలీసుల విచారణను ఎదుర్కోంటున్నారు. పీవీపి అడుగుజాడల్లో నడిస్తే పోలీసుల విచారణను ఎదుర్కోవాలా.? అని సందేహిస్తున్నారా..

అసలు మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే.. మొన్నామధ్య విధులకు ఆటంకం కల్గించారని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో పీవీపీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదెందుకు జరిగిందంటే.. ఓ కేసులో విచారించేందుకు ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు జూబ్లీహిల్స్ ఎస్ఐ వెళ్లగా, అయనను ఇంట్లోకి రానీయకుండా పీవీపీ తన పెంపుడు కుక్కలను వదిలాడు. కుక్కలను చూసిన ఎస్ఐ అవి గాయపర్చే లోపు తప్పించుకుని ఠాణాకు వచ్చి ఉన్నతాధికారులతో జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే అదే తరహాలో తనకు ఐదు లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చిన వృద్దురాలి పైకి కూడా అదే పనిచేశాడు.

తన పెంపుడు శనకాలను వదిలాడు. ఇదేమిటీ ఇన్నాళ్లు డబ్బును సవ్యంగా తిరిగి ఇచ్చేస్తానన్న వ్యక్తి ఏకంగా తనపైకి తన పెంపుడు కుక్కలను వదిలాడని కలత చెందిన వృద్దురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమరావతి మండలం మద్దూరుకు చెందిన రామావత్ చంపల్లి అనే వృద్దురాలు రూ, ఐదు లక్షలు రసూల్ పేటలోని రైల్వే ఉద్యోగికి అప్పుగా ఇచ్చింది. తనకు డబ్బులు అత్యంత అవసరమని అమెను బతిమాలితే అమె తాను కష్టించి దాచుకున్న మొత్తాన్ని తెచ్చి ఇచ్చింది, కానీ డబ్బు ఇవ్వక.. ఫోన్ లేపకపోవడంతో.. విసుగుచెందిన వృద్దురాలు ఆయన ఇంటికి చేరుకోగా, ఆయన అమె పైకి కుక్కలను వదిలారు, కాగా పిర్యాదును తీసుకున్న స్థానిక పోలీసులు అమె పిటీషన్ పై విచరాణ జరుపుతున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP leader  Potluri Vara Prasad  rasoolpeta  Railway Employee  Creditors  dogs  Amaravati  Andhra Pradesh  crime  

Other Articles