Man spins glasses of water, impresses netizens ఫిజిక్స్ వండర్: గ్లాసుల్లో నీళ్లు.. గాలిలో గిరగిర.. చుక్క పడలేదుగా..

Man spins glasses of water without spilling them impresses netizens

Man spins glass without spilling, water-filled glasses spins like a pendulum, gravity-defying stunt, Physics trick, Physics, Viral video, Trending news, Tamil Nadu

A video of a man spinning two water-filled glasses like a pendulum is making rounds on the internet. In the viral video, a man places two glasses on a plate, attached to ropes. Then in a gravity-defying stunt, he starts to twirl the rope around his head, without dropping a single drop of water.

ITEMVIDEOS: ఫిజిక్స్ వండర్: గ్లాసుల్లో నీళ్లు.. గాలిలో గిరగిర.. చుక్క పడలేదుగా..

Posted: 07/04/2020 10:14 PM IST
Man spins glasses of water without spilling them impresses netizens

ఓ యువకుడు రోడ్డుపై నిలబడ్డాడు. తక్కెడలాగా ఉన్నట్లు రెండు ప్లేట్లు తాళ్లతో కట్టాడు. ఆ ప్లేట్లపై గ్లాసులు పెట్టాడు. అందులో నీళ్లు పోశాడు. అనంతరం అమాంతం తాళ్ల సహాయంతో పైకి లేపాడు. గిర..గిరా..ఇష్టమొచ్చినట్లు తిప్పాడు. అయ్యో..గ్లాసులు పడిపోవడం లేదా నీళ్లు చల్లిపోవడం జరుగుతుందేమో అంటూ కంగారుపడుతున్నారా.. కానీ ఈ యువకుడు చేసిన పనికి ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు.. సరికదా కనీసం గ్లాసులు కూడా ఏమీ కాలేదు. ఇక పైపెచ్చు గ్లాసుల్లోని నీటిని యువకుడు తాగేసి.. నీళ్లు గ్లాసుల్లో పధిలంగా వున్నాయని చూపించాడు. ఇదంతా వింతగా అనిపిస్తోందా.. లేక అద్భుతమని భావిస్తున్నారా.. నిజంగా అలాంటిదే.

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తాంగా శరవేగంగా విస్తరిస్తోంది. లాక్ డౌన్ సీజన్లు ముగిసి.. అన్ లాక్ సీజన్ 2.0 కూడా అమల్లోకి వచ్చింది. కానీ పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి లేదు. ఈ సమయంలో ప్రజలు తమకు తోచిన విధంగా సమయాన్ని వినియోగించుకున్నారు. అయితే కొంత మంది మాత్రం తమకు ఇష్టమైన సబెక్టులలో మరింత లోతుగా చదవి దానిని వంటపట్టించుకున్నారు. ఇంకొందరు తాము చదవింది వింత కాదు.. అద్బుతం అని అందరికీ దానిని చూపించాలన్న ఉబలాడపడుతుంటారు. ఇలా చవిన విషయాన్నే తన టాలెంట్ తో అచరణలో పెట్టి చూపిస్తున్నాడు ఈ యువ శాస్త్రవేత్త. ఫీట్లు చేస్తూ..సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. అందరి ప్రశంసలూ పొందుతున్నారు.

చెన్నైకి చెందని ఈ కుర్రాడు..ఎవరూ ఊహించని విధంగా ప్రదర్శన ఇచ్చాడు. రెండు గ్లాసుల్లో నిండా నీరు పోసి..తాళ్ల సహాయంతో గ్లాసులను వేలాడదీసి..అన్ని వైపులా గిర్రగిర్రున తిప్పాడు. కానీ…గ్లాస్ తిరగబడితే..నీళ్లు కింద పడాలి..గ్లాసు కింద పడాలి కదా..అని అనుకుంటారు. కానీ ఇక్కడే ఓ టెక్నిక్ చేశాడు. ఇందుకు ఫిజిక్స్‌లో ఆన్సర్ ఉంది. స్పీడుగా గ్లాసులను తిప్పుతుండడంతో..నీటిలో భూమ్యాకర్షణ శక్తి క్షణక్షణానికి మారిపోతుందని, నీరు కిందపడేలోపే..గ్లాస్ తిరగబడుతోంది. అందువల్ల నీరు తిరగి గ్లాస్ లోకే వెళుతోంది. అదే…అతను స్లోగా తిప్పితే మాత్రం ఖచ్చితంగా నీరు, గ్లాసులు కిందపడిపోవడం ఖాయమంటున్నారు. ఈ ఫార్ములాను పక్కాగా ఉపయోగించి సక్సెస్ అయ్యాడు. పలువురు నెటిజన్లు సూపర్ బాస్..అంటూ కితాబిస్తున్నారు.

(Video Source: Google Trands)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man spins glass  pendulum  gravity stunt  Physics trick  Viral video  Trending news  Tamil Nadu  

Other Articles