Minister urges devotees not to come to Ujjain temple ఇంట్లోనే బోనాల సమర్పణ.. ఆలయాలకు రావద్దు: తలసాని

Telangana minister urges devotees not to come to ujjain temple asks to offer bonalu from houses

Telangana minister talasani srinivas yadav, talasani srinivas yadav devotees, Ujjaini Mahankali Temple, Secundrabad, Bonalu, Traditional fest, Telanagana

Telangana minister talasani srinivas yadav urges devotees not to come to Ujjain Secundrabad temple on this sunday on the eve of Mahankali Bonalu, The Animal Husbandry Minister asks the devotees to offer Bonalu from their respected houses.

ఇంట్లోనే బోనాల సమర్పణ.. ఆలయాలకు రావద్దు: తలసాని

Posted: 07/04/2020 10:51 PM IST
Telangana minister urges devotees not to come to ujjain temple asks to offer bonalu from houses

కరోనా వైరస్ మహమ్మారి మాటు వేసి ప్రజలను కాటు వేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనల మేరకు భక్తులు ఇళ్లలోనే అమ్మవారికి బోనాలను సమర్పించుకోవాలని రాష్ట్ర మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ నెల 12న జరగనున్న సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అమ్మవారికి బోనాల మహాత్సవం సందర్భంగా జరిగే అన్ని కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పారు. అయితే కరోనా నేపథ్యంలో జాతర సందర్భంగా ఆలయంలోకి భక్తులకు అనుమతించడం లేదని తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పండుగ చేసుకోవాలని సూచించారు. వీఐపీ, వీవీఐపీలకు కూడా అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

ఆలయ పూజారులే అమ్మవారికి బోనాలను సమర్పిస్తారని అన్నారు. కాగా ప్రభుత్వం తరుపున అందించే పట్టు వస్ర్తాలను దేవాలయ సిబ్బందే అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో సంబంధిత శాఖ కమిషనర్‌ అనిల్ కుమార్‌, ఉత్తర మండల పోలీస్‌ అధికారులు, ఆలయ ట్రస్టీ, మైత్రీ కమిటీ సభ్యులతో కలిసి జాతరపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరను కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆలయం లోపలే జరుపుతామన్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, ట్రస్టీ సభ్యులు మాత్రమే పూజల్లో పాల్గొంటారని తెలిపారు.

వీరిని మినహాయించి ఇతరులెవ్వరూ ఆలయంలోనికి రారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నెలకోన్న అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో మారిన భక్తులు అందుకు అనుగూణంగా నడుచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 13న నిర్వహించే రంగం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ చేసేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. జాతరను పురస్కరించుకొని పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేయాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. కాగా, ఉజ్జయినీ అమ్మవారికి జాతరకు ముందే భక్తులు బోనాలు సమర్పించారు. తలపై బోనంతో శుక్రవారం దేవాలయానికి భక్తులు రాగా.. ఆలయ సిబ్బంది శానిటైజ్‌ చేసి టెంపరేచర్‌ చూసిన తర్వాత లోనికి అనుమతించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav  devotees  Ujjaini Mahankali Temple  Bonalu  Telanagana  

Other Articles