India extends ban on international flights till July 31 అంతర్జాతీయ విమానసర్వీసులు నెలాఖరు వరకు రద్దు

India bans international flights till july 31 dgca to allow some planes on select routes

international flights suspended,international flights resume,international flights reopen in India,dgca,ban on international flights,coronavirus,latest news on international flights in india,ban on international flights in india,Vande Bharat Mission

In the wake of coronavirus outbreak, the Directorate General of Civil Aviation (DGCA) today has decided to suspend all the international flight operations in the country till July 31. However, the DGCA may permit international flights on some selected routes during this period.

కరొనా ఎఫెక్ట్: అంతర్జాతీయ విమాన సర్వీసులు నెలాఖరు వరకు రద్దు

Posted: 07/04/2020 12:32 AM IST
India bans international flights till july 31 dgca to allow some planes on select routes

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రభావాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. విదేశాల్లో దీని ప్రభావానికి గురైనవారి సంఖ్య కూడా అధికంగానే వుంది. ఈ నేపథ్యంలో విదేశీప్రయాణాలు చేసేవారిపై ఇప్పటికే లాక్ డౌన్ నాటి నుంచి నిషేధం కొనసాగుతోంది. ఇక విదేశాల నుంచి మన దేశానికి వచ్చేవారిపై కూడా దీని ప్రభావం పడుతోంది. విదేశాల్లో దీని ప్రభావానికి గురైన, కానీ దేశస్థుల కోసం వందే భారత్ పేరుతో కేంద్రం ప్రత్యేక విమనాలను నడుపుతున్న విషయం తెలిసిందే. అలా వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్, ఐసోలేషన్ లకు తరలివెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కరోనా మహమ్మారి పంజా విసరుతున్న క్రమంలో విదేశీయానం చేసేవారికి మాత్రం ఇది చేదు వార్తే.

కరోనా ఉద్ధృతి కట్టడి చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ నెలలో విదేశీయానాలకు విహంగాలు ఎగురుతాయని ముందస్తుగా చేసిన ప్రకటనను తాజాగా కేంద్ర పౌరవిమానాయాన శాఖ ఉపసంహరించుకుని కొత్తగా సవరణలను తీసుకువచ్చింది. వీదేశీ విమాన సర్వీసుల రద్దును జులై 31 వరకు కొనసాగిస్తున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలు కొన్ని నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేయగా.. ఆ తర్వాత దాన్ని జులై 15 వరకు పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  తాజాగా నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

అయితే, అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు గల్ఫ్‌ దేశాలకు ప్రయాణికుల విమాన సర్వీసులకు సంబంధించి ఆయా దేశాల విమానయాన శాఖలు సంప్రదింపులు జరుపుతున్నట్టు డీజీసీఏ ఛైర్మన్‌  అరవింద్‌ సింగ్‌ తెలిపారు. పౌర విమనాయానశాఖ కూడా అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ నుంచి ద్వైపాకిక్షక సర్వీసులు నడపడంపై దృష్టి సారించినట్టు తెలిపింది. ప్రస్తుతం వందే భారత్‌ మిషన్‌లో భాగంగా మే 6 నుంచి ఎయిండియాతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు యథాతథంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles