Telangana's tally surges past 20000 mark with 1900 cases తెలంగాణలో 24 గంటల్లో 1900 కేసులు.. 8 మరణాలు

Covid 19 update with 1900 new covid 19 cases telanganas tally surges past 20000 mark

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

There is no stopping to the rise in the number of positive COVID-19 cases in Telangana. The state government has come under intense pressure from all corners for the lack of testing and mismanagement of the crisis in the state. 1892 fresh COVID-19 cases were reported in Telangana which saw the state's tall cross the 20000-mark.

తెలంగాణలో కరోనా విజృంభన: 24 గంటల్లో 1900 కేసులు.. 8 మరణాలు

Posted: 07/04/2020 12:13 AM IST
Covid 19 update with 1900 new covid 19 cases telanganas tally surges past 20000 mark

(Image source from: Thehindu.com)

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు పద్దెనిమిది వేల మార్కును దాటాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఏకంగా మరణాలలో 280 మార్కును చేరడం అందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకే దేశంలో వందకుపైగా మరణాలు నమోదు చేసుకున్న తొమ్మిదవ రాష్ట్రంగా నమోదైన తెలంగాణ.. ఇక ఇటు కరోనా కేసులలోనూ పైకి ఎగబాకుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రాష్ట్రంలో రోజుకు వేయ్యికి పైగా కేసులు నమోదు కావడం రాష్ట ప్రజలను అందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు వారి పనితీరుకు సవాల్ విసిరేలా తయరావుతున్నాయి.

ఏప్రిల్ నెలలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం అగడం లేదు. ఇవాళ తాజాగా ఏకంగా రెండు వేల మార్కుకు చేరువలో తెలంగాణలో కరోనా కేసులు నమోదుకాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 1658 నమోదు కావడంలో నగరవాసుల్లోనూ అందోళన మరింత తీవ్రమైంది.

గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా ఇరవై వేల మార్కును అధిగమించాయి, దీంతో 20 వేలకు పైగా కరోనా కేసుల నమోదు చేసుకున్న 9వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 1658 కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికసంఖ్యలో నమోదయ్యాయి.

అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల కన్నా అధికసంఖ్యలో హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 20000 మార్కును దాటిన విషయం తెలిసిందే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ ఎనమిది మంది అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 283కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 1892 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 20,462 కేసులు నమోదయ్యాయి, గ్రేటర్ పరిధిలో 1658 కేసులు నమోదు కాగా, ఇక రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్ జిల్లా పరిధిలో 44, వరంగల్ రూరల్ జిల్లాలో 41 కేసులు. సంగారెడ్డిలో 20 కేసులు, నల్గోండ జిల్లాలో 13, మహబూబ్ నగర్ జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోలో ఆరు, ఖమ్మంలో రెండు, కరీంనగర్లో 1, గద్వాలలో 1, కామరెడ్డి జిల్లాలో ఆరు, సిద్దిపేట జిల్లాలో 3, ములుగు జిల్లాలో 1, జగిత్యాల జిల్లాలో 1, మహబూబాబాద్ జిల్లాలో 7, నిర్మల్ జిల్లాలో రెండు, మెదక్ జిల్లాలో మూడు, నిజమాబాద్ జిల్లాలో మూడు, వరంగల్ అర్బన్ జిల్లాలో 1, వనపర్తిలో ఐదు, నగర్ కర్నూల్ జిల్లాలో 1, వికారాబాద్ జిల్లాలో 1 కేసు పాజిటివ్ గా నిర్థారణ అయ్యాయి. కరోనా బారినపడిన బాధితులు కోలుకొని మొత్తంగా 10195 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9984 యాక్టివ్‌ కేసులు వున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Revolutionary balladeer vangapandu prasada rao passes away

    జనపద జానపదగళం మూగబోయింది.. వంగపండు ఇకలేరు..

    Aug 04 | ప్రజాగాయకుడు, విప్లవ రచయిత, జానపద కళాకారుడు, ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ఉత్తరాంధ్ర జనం పాట ఊపిరి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస... Read more

  • Ex cpm mla from telangana sunnam rajaiah dies of covid 19

    మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కాటేసిన కరోనా

    Aug 04 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ప్రజల ప్రానణాలతో చెలగాటం ఆడుతోంది. ఇన్నాళ్లు సామాన్యుల ప్రాణాలను టార్గెట్ చేసుకుని కబళించిన కరోనా.. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇటీవలే... Read more

  • Covid 19 update with 1286 new covid 19 cases telanganas tally surges near 69000 mark

    తెలంగాణలో కరోనా విజృంభన: 24 గంటల్లో 1286 కేసులు.. 12 మరణాలు

    Aug 04 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా అరవై తోమ్మిది వేల మార్కుకు చేరువలో వున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా... Read more

  • Coronavirus cases in india records spike of over 50000 cases tally tops 18 5 lakh

    దేశంలో కరోనా ఉగ్రరూపం: 18 లక్షలు చేరిన కేసులు.. 39 వేలకు చేరిన మరణాలు

    Aug 04 | దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోమారు... Read more

  • Kangana ranaut alleges gunshots fired near her residence in manali

    హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..!

    Aug 02 | బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ గా ఇటీవలే ముద్రపడిన కంగనా రనౌత్ ఇంటివద్ద తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరగ్గా అమె... Read more

Today on Telugu Wishesh