AICTE says classes to start for old student from August 1 సెప్టెంబరు 15 నుంచి కొత్త విద్యాసంవత్సరం: ఏఐసీటీఈ

Aicte says engineering colleges to start from september 15 counselling before august 31

coronavirus, corona norms violation, COVID-19 guidelines, Epidemic Diseases Act, National Diaster Management, COVID-19, quarantine, xat 2020 result xlri delhi-nce campus courses, XLRI, xlri delhi-ncr campus, XLRI Jamshedpur, xlri jhajjar

The urgency to conduct a lavish wedding with guests amid the COVID-19 pandemic has cost a groom’s family in Rajasthan's Bhilwara district a huge price - the death of the groom’s grandfather, a fine of ₹6 lakh, and an order to bear the treatment cost of 15 infected guests and the isolation fee of 58 quarantined guests.

ఆగస్టు 1 నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల తరగతులు: ఏఐసీటీఈ

Posted: 07/03/2020 01:11 PM IST
Aicte says engineering colleges to start from september 15 counselling before august 31

దేశవ్యాప్తంగా వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థల నూతన విద్యా సంవత్సరం ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) పేర్కొంది. ఈ మేరకు సవరించిన అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. కొత్తగా సాంకేతిక విద్యాలో చేరే విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ షెడ్యూల్ ను సవరించి కొత్త అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

అయితే ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సులలో కొనసాగుతున్న పాత విద్యార్థులు తరగతుల నిర్వహణను కూడా సవరించింది. వీరికి ఆగస్టు 1 నుంచి ప్రారంభం కావాల్సిన తరగతులను తాజాగా ఆగస్టు 16 నుంచి ప్రారంభించాలని తాజాగా తమ సవరించిన విద్యా క్యాలెండర్ లో పేర్కోంది. అయితే పోస్టు గ్రాడ్యూయేట్ డిప్లమా కోర్సులను అభ్యసిస్తున్న పాత విద్యార్థులకు మాత్రం ఈ నెల 1 నుంచి ప్రారంభం కావాల్సిన తరగతులను ఈ నెల 15 నుంచి ప్రారంభించాలని తాజాగా పేర్కోంది. ఇక ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.

యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును జులై 15 వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. గతంలో దీని గడువు జూన్ 30గా ఉంది. అలాగే,  ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్‌ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్‌ పూర్తి చేసి మిగిలిన సీట్లను సెప్టెంబరు 15లోగా పూర్తి చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. అయితే కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో పీజిడిఎం, పీజీసీఎం పాత విద్యార్థులకు ఈ నెల 15 నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అందోళన వ్యక్తం అవుతోంది. ఇక దీనికి తోడు ఆగస్టు 16 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబిఏ, ఎంసీఏ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు తరగతులను ప్రారంభించడంపై కూడా అందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  bridegroom dad fined  lavish wedding  Bhilwara  COVID-19  quarantine  Rajasthan  

Other Articles