Bharat BioTech's Covid-19 vaccine will be available by August 15 పంద్రాగస్టు నాటికి కరోనా వాక్సీన్ రెడీ

Bharat biotechs covid 19 vaccine will be available by august 15

coronavirus vaccine, corona vaccine, covid vaccine, covid-19 vaccine, inidan corona vaccine, indian vaccine clinical trails, Bharat Biotech corona vaccine, ICMR corona vaccine, corona vaccine human trails, bharat biotech vaccine August 15th, immune defences, Bharat biotech, covaxin, ICMR, indian vaccines

A coronavirus vaccine from Indian Pharma company Bharat BioTech has given a good news to the people of country, that they will launch the corona vaccine in india on august 15th. The announcement came by the makers jointly by company and ICMR.

కరోనా వాక్సీన్: పంద్రాగస్టు నాటికి అందుబాటులోకి తొలి భారతీయ వాక్సీన్

Posted: 07/03/2020 12:15 PM IST
Bharat biotechs covid 19 vaccine will be available by august 15

కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ దేశ ప్రజలకు శుభవార్తే అందించింది భారత దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్. ఆగస్టు 15 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. క్రియా రహిత వైరస్ ఆధారిత ఈ వ్యాక్సిన్, జంతువుల్లో పూర్తి సత్ఫలితాలను ఇవ్వగా, మానవులపై క్లినికల్ ట్రయల్స్ కు కూడా అనుమతి పోందింది. ఇక హ్యూమన్ ట్రయల్స్ కూడా ప్రారంభించిన ఈ వాక్సీన్ ను పంద్రాగస్టు నాటికి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న యోచనలో వుంది.

దేశప్రజలకు కరోనా నుంచి విముక్తిని ప్రసాదించడంతో పాటు దాని నుంచి స్వేచ్చా, స్వతంత్ర్యాన్ని తిరిగి పోందేందుకు సరిగ్గా స్వాతంత్ర దినోత్సవం రోజునే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నామని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 12 ఇనిస్టిట్యూట్ లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తామని, అన్ని క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు తొలివారం నాటికి పూర్తవుతాయని తెలియజేశాయి. ఈ విషయాన్ని ఐసీఎంఆర్, తన భాగస్వాములందరికీ తెలియజేసింది. ఈ మేరకు ఓ లేఖ రాసిన ఐసీఎంఆర్, ఎంపిక చేసిన కేంద్రాలు క్లినికల్ ట్రయల్స్ కు సన్నద్ధమవ్వాలని సూచించింది.

త్వరితగతిని ట్రయల్స్ ను పూర్తి చేసి, ఫలితాల వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. దీన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని కోరింది. ఈ వ్యాక్సిన్ ను ఐసీఎంఆర్, పూణెలోని వైరాలజీ ల్యాబ్ సహకారంతో భారత్ బయోటెక్ తయారు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో పూర్తి ఫలితాలు సంతృప్తికరంగా ఉంటేనే వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య రంగంలోని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. లక్ష్యాలను చేరుకునేందుకు బీబీఐఎల్ చేస్తున్న కృషిని అభినందిస్తూనే, ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona vaccine  covid 19 vaccine  Bharat biotech  covaxin  ICMR  indian vaccines  

Other Articles