India Bans Tik Tok along with 59 China Apps టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై భారత్ బ్యాన్.!

Tik tok set to lose its biggest ground as india bans 59 china apps

Tiktok Banned In India, 59 Chinese Apps Banned In India, India Bans 59 Chinese Apps, Ban On Chinese Apps, China apps Banned By India, Govt Of India, UC Browser Banned In India, China Apps Banned In India, Tiktok, china apps, India, Tiktok banned, china apps banned, video sharing app, Indian Government

At the height of tensions along the LAC, the Indian government has decided to ban Chinese apps that are diverting data and those are fraught with privacy concerns. The central government took a decision to ban in all 59 Chinese apps including popular video sharing app Tik Tok.

టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై భారత్ బ్యాన్.!

Posted: 06/30/2020 12:44 AM IST
Tik tok set to lose its biggest ground as india bans 59 china apps

భారత్-చైనాల మధ్య భారత ఎల్ఏసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. గ్వాలన్ వ్యాలీలో ఏకంగా 20 మంది భారత అర్మీకి చెందిన సైనికులతో పాటు కల్నల్ సంతోష్ బాబును ఇనుప చువ్వలతో దాడి చేసి వారి మరణానికి కారణమైన నాటి నుంచి చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారత దేశ ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో చైనాలో తయారైన వస్తువులను కూడా నిషేధిస్తున్నారు. చైనా బజార్లలో లభించే హర్ ఏక్ మాల్ ప్లాస్టిక్ వస్తువుల నుంచి భారత్ దేశ ప్రభుత్వ సంస్థల కాంట్రాక్టుల వరకు అన్నింటా చైనాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా భారత ప్రభుత్వం కూడా చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైనా ఆధారితంగా తయారైన టిక్‌టాక్‌, ఎంఐ వీడియో కాల్‌ సహా మొత్తం 59 యాప్‌లను దేశ ప్రజలు వాడొద్దని సూచించింది. ఈ యాప్‌లు ద్వారా భారత్‌ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయని చైనాకు భారత్‌ ఎన్ని విజ్ఞప్తులు చేసింది.

అయితే వాటిపై చైనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో చైనా యాప్ లపై నిషేధం విధించింది. ఇటీవల భారత్‌ -చైనా సరిహద్దులో గల్వాన్‌ వ్యాలీ వద్ద నెలకొన్న భీకర ఘర్షణ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిశీలనలోకి తీసుకున్న కేంద్రం ఓవైపు శాంతియుతంగా చర్చలు జరుపుతూనే.. మరోవైపు, చైనా ఆగడాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. చైనా ఉత్పత్తులు, చైనా పేరుతో తయారై భారత్‌లో అనేక రకాలుగా చలామణిఅవుతున్న యాప్‌లు దేశ భద్రత, రక్షణకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాయని పసిగట్టిన భారత్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles