Global fatalities, infections pass grim milestones ప్రపంచవ్యాప్తంగా కోటిమందిపై కరోనా ప్రభావం.. 5 లక్షల మరణాలు

Global fatalities infections pass grim milestones

Coronavirus, Covid-19, United states, world health organistaion, Trump administration, California, San Quentin, America, President Donald Trump, Brazil

Deaths from the coronavirus surpassed 500,000 worldwide and confirmed cases exceeded 10 million as the World Health Organization reported the most infections for a single day. All indicators pointed to a pandemic that is far from over.

ప్రపంచవ్యాప్తంగా కోటిమందిపై కరోనా ప్రభావం.. 5 లక్షల మరణాలు

Posted: 06/29/2020 01:48 PM IST
Global fatalities infections pass grim milestones

(Image source from: Abc7news.com)

ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు పైగా విస్తరించి.. అన్ని దేశాల్లోనూ తన ప్రభావాన్ని చాటుకుంటోంది మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏకంగా కోటి మందికిపైగా తన ప్రభావానికి గురిచేసింది. ఇక ఏకంగా ఐదు లక్షల మంది ప్రాణాలను కబళించివేసింది. ఇటు దేశంలోనూ రోజురోజుకూ అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కేసుల మాదిరిగానే అటు ప్రపంచ వ్యాప్తంగానూ రోజురోజుకూ కేసులు సంఖ పెరుగుతూ అందోళనకర పరిస్థితులను ఉత్పన్నం చేస్తోంది. ఆదివారం రోజున 24 గంటల వ్యవధిలో దాదాపు 190,000 కొత్త కేసులను నమోదు కాగా, తాజాగా ఇవాళ ఏకంగా రెండు లక్షల కేసులు నమోదు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది.

ఇక మరణాల సంఖ్య కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా ఐదు లక్షల మార్కు దాటింది. కరోనా వైరస్ ప్రభావం బారిన పడి అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ప్రపంచదేశాలన్నీ అందోళన చెందుతున్నాయి. జెనీవాలో ఉన్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ నివేదిక ప్రకారం, అమెరికా నుండి వచ్చిన కేసులు 189,077 కొత్త అంటువ్యాధులలో 62%, ఆగ్నేయాసియా నుండి 13% మరియు యూరోప్ దేశాల నుండి 8.8శాతంగా ఉన్నాయి. అమెరికా మరియు బ్రెజిల్ దేశాలలో కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా వుంది. ఈ రెండు దేశాల మధ్య నమోదైన కేసుల సంఖ్య సుమారుగా యాభై శాతం నమోదయ్యాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా కోటి మందికి పైగా కేసులును చూపించింది,

ఇక తాజాగా నమోదైన కేసులతో సోమవారం నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణంకాల ప్రకారం ఏకంగా కోటి మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం మరియు బ్లూమ్బెర్గ్ న్యూస్ సేకరించిన సమాచారం ప్రకారం, అమెరికాలో కరోనా వైరస్ కేసులు గతం కంటే మరింత అత్యధికంగా విజృంభిస్తున్నాయి. టోక్యోలో తాజాగా మరో ఆరవై కేసులు నమోదయ్యాయి. టోక్యలో గత నెలలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఇక సింగపూర్ తమ దేశంలోని పర్యాటకులను ఆకర్షించేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేసింది. జూలై 1 నుంచి తమ దేశంలో కాసినోలను తెరిచేందుకు అదేశాలను కూడా జారీ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పలువురు అమెరికన్లు ట్రంప్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిందని అక్షేపించారు.

కీలక పరిణామాలు:

 

*    గ్లోబల్ ట్రాకర్: కేసులు 10 మిలియన్లు దాటాయి; మరణాలు టాప్ 500,000

*    ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్ -19 కేసులు కోటిమంది బాధితులు

*    భారతదేశ నగరాల నుంచి కోట్లాది మంది వలస కార్మికులు స్వస్థలాకు వెళ్లిపోయారు

*    అమెరికా ఐదు దశల్లో కోవిడ్ -19 మహమ్మారిని మారుస్తోంది

*    రెండవ తరం టీకాలు తయారీపై కరోనావేగం ప్రభావం చూపుతున్నాయి

.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  United states  world health organistaion  Trump  

Other Articles