కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 14 లక్షల మందిపై ప్రభావం చూపడగా, ఏకంగా నాలుగున్నర లక్షల మందికిపైగా ప్రజల ప్రాణాలను కబళించివేసింది. దీని ప్రభావన ప్రపంచ ప్రజలు పడకుండా వాక్సీన్ ను సిద్దం చేసే పనిలో ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి, ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖండంలోని నైజీరియాలోని శాస్త్రవేత్తలు తమ దేశప్రజల అందుబాటులోకి తాము వాక్సీన్ ను తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ సంస్థతో పాటు ప్రస్తుతం మరో 16 సంస్థలు వాక్సీన్ రూపకల్పన చేసే పనిలో వున్నాయి. అయితే మొదటి నుంచి వాక్సీన్ తయారీలో నిమగ్నమైన ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న టీకా తుది దశకు చేరిందని జెన్నర్ ఇన్ స్టిట్యూట్ వర్గాలు తెలిపాయి.
తమ వాక్సీన్ తయారీ చివరి దశకు చేరుకుందని, దీనిని అక్టోబర్ నాటికి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయని తెలిపాయి. ఇప్పటివరకు తమ వాక్సీన్ ప్రయోగ దశలో సత్ఫలితాలు వచ్చాయని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అడ్రెన్ హిల్ తెలిపారు. తాము తయారు చేసిన వాక్సీన్ జంతువులపై ప్రయోగంలో మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు. ఇటీవల చింపాజీలపై జరిపిన ప్రయోగంలోనూ సత్పాలితాలను చూపిందన్నారు. ఆయన స్పానిష్ సొసైటీ ఆఫ్ రూమటాలజీలో నిర్వహించిన వెబినార్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వాక్సీన్ తయారీలో తమ ప్రయోగ ఫలితాలను ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి ప్రకటిస్తామన్నారు.
అలాగే అన్ని అనుకున్నట్లుగా సాగితే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తమ వాక్సీన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఆస్ట్రాజెనికాతో కలిసి బ్రెజిల్ లో హ్యూమన్ ట్రాయల్స్ లో భాగంగా అక్కడి వాలంటీర్లపై కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాక్సీన్ రేసులో తొలిసారి తుది దశకు చేరింది కూడా ఆక్స్‌ఫర్డే కావడం విశేషం. తుదిదశలో వాలంటీర్లను సార్స్‌కోవ్-2 నుంచి టీకా ఏ మేరకు రక్షణ ఇస్తోందో పరిశీలించనున్నారు. దక్షిణాఫ్రికాలో దాదాపు 2,000 మంది ఈ టీకా ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఇక బ్రిటన్ లో 4,000 మంది నమోదు చేయించుకొన్నారు. బ్రిటన్ లోని బిజినెస్ సెక్రటరీ అలోక్ వర్మ తొలిసారి కొవిడ్19 టీకా తీసుకొన్న వ్యక్తిగా నిలిచారు. మరోపక్క ఆస్ట్రాజెనికా 30 మిలియన్ల డోసులను వెంటనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more