YSRCP issues notices to its own MP వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై విరుచుకుపడ్డ సొంత పార్టీ ఎంపీ

Ysrcp issues show cause notice to mp raghurama krishnam raju

Show cause to Vijay Rama Raju, VijaySai Reddy, General Secretary, Raghu Rama Krishnam Raju, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju YCP notices, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju showcause notice, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

The YSRCP issued a show-cause notice to Narsapuram MP Raghurama Krishnam Raju for speaking against his own party leaders in TV debates. The notice said that the party will take action against the MP if he fails to respond within a week. It was issued by YSRCP National General Secretary and Rajya Sabha member Vijay Sai Reddy.

అధిష్టానంపై అసంతృప్తి.. సొంత పార్టీ ఎంపీకి వైసీపీ షోకాజ్ నోటీసులు

Posted: 06/24/2020 09:18 PM IST
Ysrcp issues show cause notice to mp raghurama krishnam raju

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ రాష్ట్ర పాలనా పగ్గాలను చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంలో సంబరాలు జరగాల్సిన ఆ పార్టీలో ప్రస్తుతం అసమ్మతి గళాలు, అసంతృప్తులకు వినిపిస్తున్నాయి. అంతేకాదు గళం వినిపిస్తున్న నేతలకు తాజాగా షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. వాటిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జారీ చేశారు. వైసీపీ పార్టీ హైకమాండ్ తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై కూడా వ్యాఖ్యలు చేయడంతో.. మీడియా ముందు తన అభిప్రాయాలను వెళ్లగక్కిన నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు పార్టీ తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేసింది.

పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని తెలిపారు. రఘురామకృష్ణం రాజు సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ పేర్కొంది.

అయితే ఈ విషయాలపై పార్టీలో పార్టీపరంగా చర్చించాల్సిన అంశమని పేర్కొనాల్సిన అంశమని.. దీనిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలోనే చర్చించాలని తాను భావించినా.. తనకు సమయాన్ని కేటాయించకపోవడంతోనే విషయంపై మీడియా ముఖ్యంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇక ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా ప్రసాద రాజు సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా మీడియా ముఖంగా ఎంపీపై పలు విమర్శలు చేశారు, అయితే వీరికి మాత్రం పార్టీ ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయలేదు. ఒకరికి వర్తించిన సూత్రం.. తమ పక్షాన నిలిచినంత మాత్రమే ఇతరులకు వర్తించవా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles