TMC lawmaker Tamonash Ghosh dies with Corona కరొనా వైరస్ కాటుకు తృణముల్ ఎమ్మెల్యే కన్నుమూత

Tmc lawmaker tamonash ghosh dies at 60 had tested covid 19 positive in may

Tamonash Ghosh, Covid, coronavirus, Mamata Banerjee, Covid 19, Trinamool Congress, Falta MLA, Three time MLA, Tamil Nadu MLA, DMK MLA, film producer and MLA, West Bengal, Politics

Trinamool Congress legislator Tamonash Ghosh, who had tested positive for the coronavirus disease in May, died on Thursday morning. He was 60. West Bengal chief minister Mamata Banerjee condoled his death in a tweet.

కరొనా వైరస్ కాటుకు తృణముల్ ఎమ్మెల్యే కన్నుమూత

Posted: 06/24/2020 04:35 PM IST
Tmc lawmaker tamonash ghosh dies at 60 had tested covid 19 positive in may

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రభావాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. విదేశాల్లో దీని ప్రభావాన పడి దేశాలకు చెందిన కీలక నేతలు క్వారంటైన్, ఐసోలేషన్ లకు తరలివెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఇటు దేశంలోనూ ఇప్పటికే  చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిని సైతం కబళించిందిన. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే ను కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఇక తాజాగా పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కూడా కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకుంది. పశ్చిమబెంగాల్ అధికార ప్రభుత్వం ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపింది.

పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు హ్యాట్రిక్ విజయంతో కొనసాగుతున్న ఆయన అధికారు తృణముల్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన మే నెలలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యే తమోనష్‌ ఘోష్‌ (60) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. కరోనాతో పాటు ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుటంతో కరోనా తీవ్ర ప్రభావం చూపిందని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తమ పార్టీకి తీరని లోటని పేర్కోన్నారు.

ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సంతాపం తెలిపారు. తమోనష్‌ ఘోష్‌ ఆకస్మిక మరణం.. అందులోనూ కరోనా వైరస్ తో మరణించడం తమను కలచివేసిందని అన్నారు. ఆయన ఇవాళ తమను వదిలేసి వెళ్లడం బాధగా వుందన్నారు. ఆయన తమ పార్టీలో ఏకంగా మూడున్నర దశాబ్దాలుగా కొనసాగారని, తన ఈ రాజకీయ ప్రయాణంలో ఆయన నిత్యం తన ప్రజల సంక్షేమం, అభివృద్ది గురించి తప్పించారని మమత అన్నారు. తమోనష్‌ ఘోష్‌ తన సామాజిక సేవతో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. తమోనష్‌ ఘోష్‌ సతీమణి ఝర్నాతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలకు ఆమె తన తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles