YSRCP MP Sensational statements on party MLAs వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై విరుచుకుపడ్డ సొంత పార్టీ ఎంపీ

Ysrcp mp raghurama krishnam raju sensational statements on own party mlas

Raghu Rama Krishnam Raju, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju sensational words, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju Makes Sensational Comments On YSRCP, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

YSRCP MP Kanumuru Raghu Rama Krishna Raju on Tuesday said he is ready to contest again if his constituency MLAs who won with his photo. And also alleges that they are the address for the corruption and sand mafia.

వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై విరుచుకుపడ్డ సొంత పార్టీ ఎంపీ

Posted: 06/16/2020 10:08 PM IST
Ysrcp mp raghurama krishnam raju sensational statements on own party mlas

రాష్ట్రంలోని అధికార పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంలో సంబరాలు జరగాల్సిన ఆ పార్టీలో ప్రస్తుతం అసమ్మతి నేతలు గళం విప్పుతున్నారు, నిన్న పార్టీ హైకమాండ్ పై వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ స్పందించిన నేతలు ఆయనను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు మూడు పార్టీలు తిరిగినా సిటు ఇవ్వలేదని, చివరికి వైసీపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. గతంలో నామినేషన్ వేసిన ఆయన ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని నిలదీయడంపై రఘురామకృష్ణంరాజు కూడా ధీటుగా రియాక్ట్ అయ్యారు. సింహం సింగిల్ గానే వస్తుందంటూ తనపై విమర్శలు సంధించిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.

తన ఫోటో పెట్టుకుని ఓట్ల అడగటం ద్వారానే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని ఆన్న ఆయన ఈ విమర్శలు మింగుడపడని పక్షంలో ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే.. తాను తన పదవికి రాజీనామా చేసిన ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమని సవాల్ విసిరారు, తనను మాత్రమే ప్రజల మధ్యలోకి వెళ్లమని చెప్పే అధికారం ఏ ఒక్కరికీ లేదని, తనను ఎవరు విమర్శించినా.. వారికి ఇదే తన సవాల్ అని అన్నారు. తనలాగే ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస రావు కూడా ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ లభించిక నిరుత్సాహానికి గురయ్యారని ఎంపీ అన్నారు.

ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా గల వ్యక్తని అన్న ఆయన ప్రస్తుతం తనను విమర్శిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ ఓ ఇసుక దోంగ అంటూ ఆయనపై పలు అరోపణలు సంధించారు. ఇసుకను దొడ్డిదారిలో విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్నారని అరోపించారు. అంతేకాదు ఇళ్ల స్థలాల విషయంలోనూ ఆయన కోట్లు గడించారని ఆరోపించారు. సత్యనారాయణ అరచకాల గురించి తాను చెప్పడం కన్నా ఆయన మేనల్లుడే చెబుతాడని.. ఆయన అవినీతి చిట్టా చెంతాడంత వుందని విమర్శించారు. ఇక మరో ఎమ్మెల్యే నాగేశ్వరరావుపైనా ఎంపీ అనేక అవినీతి అరోపణలు చేశారు. ఇప్పటికే ఆయనపై పలు అరోపణలు వున్నాయని అన్నారు.

తాను ముఖ్యమంత్రి జగన్‌ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే చెప్పానని.. దీంతోనే ఎన్నికలకు ముందు జగన్ తనను విమానాశ్రయంలో కలిశారని ఈ విషయాన్ని మర్చిపోయిన కొందరు నేతలు ఇప్పడు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించిన ఆయన తన బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ బొమ్మ పెట్టుకుని మరోమారు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని రఘు రామకృష్ణరాజు సవాల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghu Rama Krishnam Raju  YSRCP  Party MLAs  Resignation  Narsapuram MP  Andhra Pradesh  Politics  

Other Articles