Health Insurance Policy new 8-year rule by Irdai ఐఆర్డీఏఐ కొత్త మార్గదర్శకాలు.. పాలసీదారుల పాలిట వరాలు..

Health insurance claims not contestable after 8 year of premium payment irdai

health insurance, irdai, premium payment, insurance, Personal Finance, IRDAI, IRDAI, Insurance claims, Personal Finance News, Business News

Health insurance companies will not be allowed to contest claims once the premium has been paid for a continuous period of eight years, regulator Irdai said in a fresh set of guidelines. Irdai said the objective of the guidelines is to standardise the general terms and clauses incorporated in indemnity based health insurance products by simplifying the wordings of general terms and clauses of the policy contracts and ensure uniformity across the industry.

ఐఆర్డీఏఐ కొత్త మార్గదర్శకాలు.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు మేలు..

Posted: 06/15/2020 02:35 PM IST
Health insurance claims not contestable after 8 year of premium payment irdai

ఆరోగ్య భీమా పాలసీలలో పలు మార్పులను తీసుకువస్తున్న భారతీయ బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ).. తాజాగా పాలసీదారులకు ఊరటనిచ్చేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు మరో నిబంధనను అమల్లోకి తీసుకురానుంది. ఇదివరకే టెలీ మెడిసీన్ ను కూడా ఎలాంటి అవరోదాలు లేకుండా క్లెయిమ్ లను అందుబాటులోకి తీసుకురావాలని అదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కరోనా కాలంలో టెలీమెడిసిన్ ను అశ్రయించిన పాలసీదారులకు భీమా కంపెనీలు క్లెయియ్ లను చేయాలని అదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా ఐఆర్డీఏఐ తీసుకువచ్చిన నిబంధనతో పాలసీదారులందరికీ ప్రయోజనం చేకూరనుంది.

తాజాగా వరుసగా 8 ఏళ్లు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తే, క్లెయిమ్‌ ల విషయంలో ఆరోగ్య బీమా కంపెనీలు సవాలు చేయడానికి వీలు లేకుండా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నష్ట పరిహార ఆధారిత ఆరోగ్య బీమాలో (వ్యక్తిగత ప్రమాద బీమా, దేశీయ/అంతర్జాతీయ ప్రయాణాలపై బీమాలు కాకుండా) పొందుపరిచిన సాధారణ నిబంధనలను ప్రామాణీకరించడమే ఈ మార్గదర్శకాల లక్ష్యమని ఐఆర్డీఏఐ వెల్లడించింది. ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా ఉత్పత్తులు ఈ మార్గదర్శకాల పరిధిలోకి రాకపోయినా, అన్ని పాలసీ కాంట్రాక్టులు 2021 ఏప్రిల్‌ 1 తర్వాత రెన్యువల్‌కు వచ్చినపుడు వీటి పరిధిలోకి వస్తాయని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

‘వరుసగా 8 ఏళ్లు పాలసీ ప్రీమియం చెల్లించడం పూర్తయితే ఆరోగ్య బీమా క్లెయిమ్ లను ఇన్సూరెన్స్ సంస్థలు సవాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ పాలసీలో శాశ్వత మినహాయింపులు ఉన్నట్లు, మోసాలు జరిగినట్లు నిరూపించగలిగితే మినహా ఏ సందర్భంలోనూ దాన్ని సవాలు చేయడానికి వీల్లేదని ఐఆర్డీఏఐ తాజా నిబంధన అమల్లోకి తీసుకువచ్చింది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అందిన తర్వాత బీమా కంపెనీ 30 రోజుల్లోగా ఆ క్లెయిమ్ లను చెల్లిస్తోందా? లేక తిరస్కరిస్తోందా.. అన్నది తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నెల రోజులకన్నా ఆలస్యమైన నేపథ్యంలో 2 శాతం వడ్డీ కలిపి పాలసీదారుడికి చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health insurance  irdai  Personal Finance  Business News  

Other Articles