Nobody Can Save Us Except Modi, Says JC రాష్ట్రాన్ని జగన్ సర్కార్ నుంచి కాపాడగలిగింది ఒక్కడే: జేసీ దివాకర్ రెడ్డి

Tdp leader jc diwakar reddy slams andhra cm over arrest of jc prabhakar reddy

JC Diwakar Reddy, JC Prabhakar Reddy, Asmith Reddy, JC Prabhakar Reddy arrested, Asmith Reddy arrest, Diwakar Travels, JC Prabhakar Reddy Bypass surgery, Regional Transport Office (RTO), tdp former mla arrested, K Atchannaidu scam, social media, coronavirus, Andhra pradesh, politics

TDP leader JC Diwakar Reddy slammed Andhra Pradesh CM Jagan Mohan Reddy over the arrest of his brother and TDP leader JC Prabhakar Reddy for allegedly tampering with vehicle registration rules. While speaking to the media at Tadipatri, Diwakar said that Jagan Mohan Reddy has no respect for Constitution and he himself is omnipotent.

రాష్ట్రాన్ని జగన్ సర్కార్ నుంచి కాపాడగలిగింది ఒక్కడే: జేసీ దివాకర్ రెడ్డి

Posted: 06/14/2020 12:10 AM IST
Tdp leader jc diwakar reddy slams andhra cm over arrest of jc prabhakar reddy

రాష్ట్రంలో ఓ వైపు కరోనా పరిస్థితులు ఉదృతంగా వ్యాప్తిచెందుతూ అందోళనకర పరిస్థితులు తలెత్తుతున్న తరుణంలో వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం..  ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయించి కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నాలను ముహ్మరం చేసిందని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, సోదరుడి తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై ఆయన భిన్నంగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందన్నారు.

స్వయంగా ఏసు ప్రభువే వచ్చి చెప్పినా వినే పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్ లేడని విమర్శించారు, జగన్ ఎవర్ని చూస్తే వారు ఇప్పుడు కటకటలా వెనక్కి వెళ్లాల్సిందేనని అన్నారు. జగన్ ను కంట్రోల్ లో పెట్టడం ఒక్క ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. తమకు కోర్టు తప్ప వేరే మార్గం లేదని ఆయన చెప్పారు. జేసీ అస్మిత్ రెడ్డికి ఈ వ్యవహారానికి సంబంధమే లేదన్నారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు నడుములు విరిగిపోయి వారు ఏమీ చేయలేక పోతున్నారని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన తమ్ముడి అరెస్టుపై తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అరెస్టుకు నిరసనగా ఎలాంటి కార్యక్రమ ప్రణాళిక లేదన్నారు.

తాను నిజం చెబుతున్నానని, తనకు ఎన్ని లారీలు ఉన్నాయో.. ఎన్ని బస్సులు ఉన్నాయో కూడా లెక్కలు తెలియదని అన్నారు. ఎవరు నమ్మినా... నమ్మకపోయినా ఈ విషయంలో తాను ఏం చేసేది లేదని అన్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపి ప్రభుత్వం దేనికి అయినా తెగిస్తుందని అరోపించారు. దీనికి రూల్స్ లేవు, రెగ్యులషన్స్ లేవు. చట్టం లేదు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్లు ఉందని.. మొత్తం పాలన ఒక్క చేతిలోనే నడుస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో తామే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాము న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సిందేనని అన్నారు. చీఫ్ సెక్రటరీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని జేసీ పేర్కోన్నారు.

జగన్ సంపూర్ణ అధికారంలో వున్నాడు.. తనకు తాను సర్వశక్తి సంప్పన్నడని భావిస్తున్నాడని అన్నారు. ఆయనే అల్లా, ఆయనే ఏసు, ఆయనే తిరుపతి వెంక్కనగా భావిస్తున్నాడని జేసీ ఎద్దేవా చేశారు. తన మాటకు ఎదురు చెప్పేవాడు, తనకు ప్రతి పక్షంలో ఎవరు లేకుండా చేయడమే తన ధేయం అన్నట్లుగా ఉంది జగన్ పాలన సాగుతోందని విమర్శించారు. జగన్ దగ్గర మంచి అధికారులు ఉన్నా వారి మాట చెల్లుబాట అయ్యేటట్లు లేదని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట కూడా వినే పరిస్థితిలో జగన్ లేడని అన్నారు. తనను నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టాడని.. తన ఆర్థిక మూలాలు లేకుండా చేశాడని అవేదన వ్యక్తం చేశాడు. ఇంతచేసినా ఆయన రేపు తనను కూడా అరెస్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని జేసి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles