Bridegroom tested corona postive day after marriage పెళ్లి విందులో కరోనా ఎంట్రీ.. వధూవరులను విడదీసి..

Bride groom tested corona postive day after marriage guests quantantined

coronavirus, covid-19, private hospital, marriage, bride, groom, marrimanu thanda, veldurthy mandal, kurnool district, Andhra Pradesh, politics

Bride Groom, who is an staff of private hospital in Hyderabad tested coronavirus postive day after marriage, He was rushed to Isolation ward, while bride and the guests were quantantined in veldurthy thanda of kurnool district in Andhra Pradesh.

పెళ్లి విందులో కరోనా ఎంట్రీ.. వధూవరులను విడదీసి..

Posted: 06/13/2020 11:50 PM IST
Bride groom tested corona postive day after marriage guests quantantined

వారిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్న నవదంపతులు. ఇలా పెళ్లి చేసుకోగానే ఇద్దరూ కలసి తమ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టేందుకు అడుగులో అడుగు వేసుకుని ముందుకు కదులుతున్న తరుణంలోనే వారిని విధి విడదీసింది. తమ పెళ్లిలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా.. అనుకున్నంత నష్టాన్ని.. అందోళనను మిగిల్చింది. అన్ లాక్ నేపథ్యంలోనూ పరిమిత బంధువులను మాత్రమే అహ్వానించి చేసుకోవాలని ప్రభుత్వాలు అంక్షలను తోసిరాజుతూ ఇష్టానుసారంగా బంధుమిత్రులను అహ్వానించడంతో ఇప్పుడు వారంతా క్వారంటైన్ కు తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు గ్రామం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా మార్చేశారు అధికారులు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమాను తండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి ఈ నెల 10న పెళ్లి నిశ్చయం కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోకి వచ్చే సమయంలోనే ఎంతకైనా మంచిదని కరోనా వైరస్ నిర్ధారణ కోసం శాంపిల్స్ ఇచ్చాడు. అయితే ఫలితాలకు కోంత సమయం పడుతుండటంతో ఈలోపే ముందుగా నిశ్చయమైన ప్రకారం పెళ్లికి రెడీ అయ్యారు. వెల్దుర్తి మండలం ఎల్. తండాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే లోలోన అస్వస్థత వున్నా.. తన పెళ్లి అన్న జోష్ అతనిలో కరో్నా లక్షణాలను అధిగమించేలా చేసింది.

బంధుమిత్రుల అశీర్వచనాలతో పెళ్లి జరిగింది. మరుసటి రోజున వరుడి ఇంటి వద్ద విందు బోజనాలు నిర్వహణ కార్యక్రమం కోసం అంతా బిజీగా వున్నారు. విందులో బంధుమిత్రులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. రిసెప్షన్ జరుగుతుండగానే పెళ్లి కొడుకు అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో అతడు ఇచ్చిన శాంపిల్స్ ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో అతడికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో పెళ్లి కొడుకును ఐసోలేషన్ కేంద్రానికి, వధువును క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. రిసెప్షన్ వేడుకలో సహపంక్తి భోజనాలు చేసినట్టు అధికారులు గుర్తించి గ్రామాన్ని కంటైన్ మెంట్ జోన్‌గా గుర్తించారు. అనంతరం 70 కుటుంబాలనుంచి శాంపిల్స్ సేకరించి.. కొంతమందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  marriage  bride  groom  Andhra Pradesh  politics  

Other Articles