COVID-19 | 180 fresh cases reported in AP ఏపీలో 3971 చేరిన కరోనా కేసులు.. 68 మరణాలు

Coronavirus in ap 180 new covid 19 cases state tally reaches 3971

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 3971 after 180 new cases were reported in the last 24 hours, out of which 2244 have so far recovered and have been discharged, while 68 have died, the state health department said.

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో 180 కేసులు..

Posted: 06/03/2020 03:14 PM IST
Coronavirus in ap 180 new covid 19 cases state tally reaches 3971

(Image source from: Deccanherald.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంతో కాసింత వేగాన్ని తగ్గించుకున్న కరోనా వ్యాప్తి.. మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 180 కేసులు నమోదయ్యాయి. ఇక అంతకుముందు వారం పది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 180 కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా నమోదైన 180 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4 వేల మార్కును చేరువలో వుంది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా నమోదైన కేసుల్లో 180 కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు మొత్తంగా 3971కి చేరాయి. అయితే ఇందులో విదేశాలకు, పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు చెందిన కేసులు 101 వుండగా, రాష్ట్రంలో మాత్రం 79 కేసులు నమోదైనట్టు గణంకాలు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగతా కేసులు పలు జిల్లాల్లో్ వెలుగుచూసిన కాంట్రెక్టు కేసులని సమాచారం.

దీంతో ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 3971 మందికి కరో్నా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారని సమాచారం. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 68కి చేరింది. కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2244కు చేరడం కూడా రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 967గా నమోదు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles