Southwest monsoon likely to reach telugu states within week తొలకరి త్వరలో పలకరింపు.. ఈ సారి వానలే వానలు..

Southwest monsoon had reached kerala on monday says imd

monsoon, monsoon 2020, monsoon in india, monsoon rains in india, arrival of monsoon, arrival of monsoon in india, southwest monsoon, arrival of southwest monsoon, monsoon season in india, departure of monsoon from india, departure of southwest monsoon, India Meteorological Department (IMD), monsoon 2020, monsoon in india, southwest monsoon, Rains in India, Rain Alert, southern states, central India, IMD

The onset of southwest monsoon had reached Kerala and likely to reach telugu states by a week, said the India Metrological Department (IMD) weather forecast on Tuesday. The weather report further stated that the monsoon is expected to bring moderate rainfall for the season.

తొలకరి త్వరలో పలకరింపు.. కేరళను తాకిన రుతుపవనాలు

Posted: 06/02/2020 12:43 PM IST
Southwest monsoon had reached kerala on monday says imd

దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం కొంత ఆలస్యం కానుందని చేసిన అంచనాలను తోసిరాజుతూ సరిగ్గా సమయంలోనే రుతుపవనాలు వచ్చేశాయి. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనుండగా.. ఈ ఏడాది కూడా అదే క్రమంలో నైరుతి రుతుపవనాలు కేరళకు చేరాయి. ఇక ఇక్కడి నుంచి వారం రోజల వ్యవధిలో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి. ఆ తరువాత దేశం మొత్తం విస్తరించే రుతుపవనాలు.. దేశంలోని రైతన్నకు మేలు చేసేలా.. ప్రజల దాహార్తిని తీర్చేలా విస్తారమైన వర్షాలను కురిపిస్తాయి. 

గడచిన ఐదేళ్లలో ఐఎండీ అంచనా వేసినట్టే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2015లో మాత్రం ఐఎండీ అంచనా తప్పింది. ఈ ఏడాది మే 30న రుతుపవనాలు తాకుతాయని అంచనా వేయగా.. వారం రోజుల ఆలస్యంగా జూన్ 5న తాకాయి. 2016లో జూన్ 7కి వస్తాయని చెబితే.. జూన్ 8న, 2017లో ఐఎండీ అంచనా వేసినట్టు మే 30న, 2018లో మే 29న దేశంలోకి రుతుపవనాలు వచ్చాయి. గతేడాది మాత్రం ఐఎండీ అంచనా కంటే రెండు రోజులు ఆలస్యంగా జూన్ 8న కేరళ తీరాన్ని తాకాయి. కాగా ఈ సారి జూన్ 5న కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని అంచనా వేయగా జూన్ 1వ తేదీనే తాకాయి.

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో ఇక దేశవ్యాప్తంగా విస్తారించిన తరువాత ఇక వానలు కురవనున్నాయి. కాగా, ఈ పర్యాయం సాధారణ వర్షపాతం కురిసేందుకు 102 శాతం అవకాశాలు ఉన్నాయని కేంద్ర భూశాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ భారతదేశంలో సాధారణంగా, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే ఈ వర్షాకాలంలో 75 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇధిలావుండగా, అరేబియా సముద్రంలో ముంబైకి 690 కిలోమీటర్ల దూరంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఈశాన్య దిశగా పయనించి మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర్-దమణ్‌ల మధ్య తీరాన్ని తాకుతుందని చెప్పారు. దీంతో తీరప్రాంతంలో జాతీయ విపత్తు అధికారులతో పాటు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంత వాసులను సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles