India's COVID-19 tally crosses 1.65 lakh దేశంలో కరోనా విజృంభన.. చైనాను మించిన మరణాలు..

Coronavirus update indias coronavirus tally crosses 1 6 lakh death toll above 4600

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The coronavirus pandemic in India grew by the highest number yet on Friday when 7,466 fresh cases where detected across the country. The total number of coronavirus cases in the country increased to 165,799. The number of deaths related to COVID-19 infection rose to 4,706. The states confirmed 175 deaths in last 24 hours.

దేశంలో 1.6 లక్షల కరోనా కేసులు.. చైనాను మించిన మరణాలు..

Posted: 05/29/2020 12:51 PM IST
Coronavirus update indias coronavirus tally crosses 1 6 lakh death toll above 4600

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది ప్రజల ప్రాణాలను హరించిన ఈ వైరస్.. భారత్ లో తన సంక్రమణ శక్తిని తగ్గించుకున్నా.. ప్రభావాన్ని మాత్రం ఇంకా కొనసాగిస్తూనే వుంది. దేశవ్యాప్తంగా తొలిసారి అత్యధిక స్థాయిలో కేసులు నమోదు కావడం అది కూడా ఏడున్నర వేలకు చేరలో నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన మరణాలతో భారత్ ఏకంగా చైనాను మించిన మరణాలను నమోదు చేసుకుంది. దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఏడు వేలకు పైబడి కేసులు నమోదు కావడం కూడా కలవరం రేపుతోంది.

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 7466 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,65,799 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 175 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4706కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో పదవ స్థానంలో కోనసాగుతున్న భారత్జ.. టర్కీ దేశాన్ని అధిగమించి తొమ్మదవ స్థానానికి ఎగబాకింది. ఇక మరణాల్లోనూ భారత్ చనాను మించిన సంఖ్యకు చేరుకోవడంతో అందోళన వ్యక్తం అవుతోంది. చైనాలో 4634 మరణాలు సంభవించగా,. భారత్ లో 4706 మరణాలు నమోదు చేసుకున్నాయి.

ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 68,149 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 89,987 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 42శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2500 కేసులు నమోదయ్యాయి, ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే 1467 పాజిటివ్ కేసులు నమోదు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది, గత సోమవారం నుంచి మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 36శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచినమోదు కావడం.. దేశవ్యాప్తంగా లక్షా యాభై వేల కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో మాత్రమే యాభై వేల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలో కేసులు పెరగడం కూడా అందోళన రేపుతోంది. ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా అత్యధికంగా మరణాలు కూడా సంభవించడం అందోళనకరం. రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 59546కు చేరగా, ఏకంగా 1982 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవవధిలో మహారాష్ట్రలో 85 మరణాలు సంభవించాయి.

ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే 827 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు సంఖ్య 19372కు చేరగా, గడిచిన 24 గంటల్లో 12 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య నమోదయ్యాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 16 వేల 281కు చేరగా, గడిచిన 24 గంటల్లో 13 మరణాలు సంభవించడంతో మొత్తంగా 316 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నమొత్తం కేసులు సంఖ్య 15,562కి చేరగా, ఏకంగా 942 మంది అసువులు బాసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles