Leopard caught after two-hour rescue operation in Nalgonda కపాడినా కనుకరించని చిరుత.. పంజా విసిరి.. బందీ అయ్యింది..

Leopard attacks two in nalgonda as forest officials try to catch him

leopard in Nalgonda, Leopard in marriguda, leopard forest officials, leopard attack forest officials, Leopard, forest officials, Nalgonda, Marriguda, rajapeta village, Nehru Zoological Park, Telangana, Crime

The forest officials and the policemen struggled for two hours and caught the Leopard which escaped from the trap injuring two officials in Rajapeta village of Marriguda Mandal in Nalgonda district.

ITEMVIDEOS: కపాడినా కనుకరించని చిరుత.. పంజా విసిరి.. బందీ అయ్యింది..

Posted: 05/28/2020 05:39 PM IST
Leopard attacks two in nalgonda as forest officials try to catch him

ఓ రైతు అడవి పందులు తన పోలంలోకి రాకుండా వేసిన కంచెలో చిక్కకుపోయిన చిరత పులిని.. నల్గోండ జిల్లాలకు చెందిన అటవీశాఖ అధికారులు కాపాడారు. అయితే అది మాత్రం వారు తమను కపాడారన్న కనీస కనికరం లేకుండా వారిపైనే దాడి చేసి గాయపర్చింది. అయితే ఇదే కసితో రగిలిన అటవీశాఖ అధికారులు కూడా దానిని ఎలాగైనా చిరుతను బంధించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇంకేముందు దాదాపు రెండు గంటల ఆపరేషన్ తరువాత రెండు సార్లు మత్తుమందు ఇచ్చిన తరువాత కేజ్ లో వేసిన దానిని బంధించారు.

వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజిపేట తండా వద్ద చిరుత ముళ్లకంచెలో చిక్కుకుంది. సమీపంలో వున్న ఓ రైతు తన పోలంలోకి అడవి పందులు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయని ముళ్లకంచెను ఏర్పాటు చేశాడు. అయితే ఆ కంచెలోకి వచ్చిన చిరుత చిక్కకుంది. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగి ముళ్ల కంచె నుంచి చిరుతను తప్పించే ప్రయత్నం చేశారు. అయితే చిరుత తనకు హాని చేస్తున్నారని భావించి వారిపై హుకంరిస్తూనే వుంది, అయినా పెద్దగా పట్టించుకోని అధికారులు దానిని ముళ్ల కంచె నుంచి తప్పించారు.

ఇలా తమను రక్షించిన క్రూరమృగాలు కూడా పలు సందర్భాలలో రక్షించిన వారితో స్నేహంగా మెలుగుతాయి. కానీ  ఈ చిరుత మాత్రం తనను రక్షించిన అటవీశాఖ సిబ్బందిపై కనీస కనికరం కూడా లేకుండా విరుచుకుపడింది. అయితే దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. ఏకంగా గంటన్నర పాటు శ్రమించిన తరువాత చిరుతకు అధికారులు మత్తు ఇంజక్షన్ ఇవ్వగలిగారు. దీంతో దానిని కేజ్ లో బంధించి.. నగరంలోని నెహ్రూ పార్కుకు తరలించారు. అయితే చిరుత దాడిలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అటవీశాఖ సిబ్బంది చిరుతను బోనులో బంధించారన్న వార్తతో నల్గోండ మర్రిగూడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leopard  forest officials  Nalgonda  Marriguda  rajapeta village  Nehru Zoological Park  Telangana  Crime  

Other Articles