తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వెలుగుచూస్తున్న కేసులకు తోడు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో కూడా కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వ, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్యాధికారులు, డాక్లర్లు ఎంతగానో శ్రమిస్తున్నా.. ఉపశమనం లభించే వాతావరణం మాత్రం అప్పుడే కనిపించడం లేదు. మరణాలు కూడా అంతకంతకూ పెరగుతూ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది.
ఈ నెల 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాగా ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. ఇక తాజాగా నమోదైన కేసులు గ్రేటర్ వాసులను మరింత అందోళనకు గురిచేస్తోంది. ఇవాళ రాష్ట్రంలో మరో ఆరు కరోనా మరణాలు సంభవించాయి, దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 63కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం. ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు కూడా కలవరాన్ని రేపుతున్నాయి.
బుధవారం విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం.. నిన్న 71 కేసులు నమోదైన తెలంగాణలో ఇవాళ ఏకంగా 107 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 2098కి చేరుకున్నాయి. వీటిలో అత్యధిక కరోనా కేసులు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారివే కావడం గమనార్హం, ఇక రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులు కూడా కరోనా పాజిటివ్ వచ్చినవారి జాబితాలో వున్నారు. మొత్తం 107 కేసుల్లో 49 కరోనా కేసులు సౌధీ అరేబియా నుంచి వచ్చినవారివే. ఇక వలస కార్మికుల్లో 19 మందికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. కాగా, ఇవాళ రాష్ట్రంలో 39 కరోనా కేసులు నమోదైయ్యాయి.
తాజాగా నమోదైన కరోనా కేసులతో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య 2000 మార్కును దాటింది. ఇవాళ నమోదైన 107 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 2098 కేసులు నమోదయ్యాయి, ఇక ఇవాళ రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా అధికంగానే సంభవించాయి, ఏకంగా ఆరుగురు ఇవాళ కరోనా బారిన పడి చికిత్స పోందుతూ అసువులుబాసారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 63కు చేరింది. ఇవాళ 37 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అవగా.. ఇప్పటివరకు 1,321 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 714 యాక్టివ్ కేసులు వున్నాయని వారంతా గాంధీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more