Telangana DGP urges everyone to stay indoors తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఉత్తరాదిన మరింత తీవ్రత..

Telangana dgp urges everyone to stay indoors as temperatures soar

Telangana DGP, Telangana police, Sun stroke, summer, hyderabadis, heat wave, Delhi, Sun, Summer, Heat, Churu, Rajasthan

Temperatures are soaring and summer has almost reached its peak in Hyderabad. With the heat wave making its presence felt, Hyderabad has recorded 44 degree Celsius as the highest this year. Officials say that the temperatures may soar higher as the state is under a heatwave alert till May 29.

ఠారెత్తిస్తున్న ఎండలు.. వడగాల్పులు.. ఇళ్లలోనే వుండాలని పోలీస్ బాస్ సూచన

Posted: 05/27/2020 12:56 PM IST
Telangana dgp urges everyone to stay indoors as temperatures soar

తెలంగాణపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు తట్టుకోలేక ప్రజలు ఠారెత్తిపోతున్నారు. లాక్ డౌన్ సడలింపులు ఉన్నా సూరీడి ఉగ్రరూపానికి కాలు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. హైదరాబాద్ లో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం.. ఇక ఈ ఉష్టోగ్రతలు ఈ నెల 29 వరకు కొనసాగతుండటం.. దీనికి తోడు వడగాల్పులు కూడా వీస్తున్న తరుణంలో ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని తెలంగాణ డీజీపి మహెందర్ రెడ్డి ప్రజలకు విన్నవించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే.. తప్పక జాగ్రత్తలు వహించాలని తెలంగాణ పోలీస్ బాస్ కోరారు.

తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాల్పులు మరింత భయం పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో నిన్న ఏకంగా 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాదు, మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే వడగాల్పులు తప్పవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

ఎంపాన్ తుపానుతో ప్రభావంతో కురిసిన వర్షాలు కాసింత ఊరట కలిగించినా.. అది కాస్తా తీరం దాటి వెళ్లిపోవడంతో పాటు తేమ కూడా వెళ్లిపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉందని, దీనికితోడు ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు, పొడి గాలులు వస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో నిన్న 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలుస్తున్నా హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు మాత్రం నిర్ధారించలేదు.

తెలంగాణ సహా అటు ఉత్తరాదిన కూడా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోద అవుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 2002 తరువాత తొలిసారిగా ఉష్ణోగ్రత 46 డిగ్రీలను దాటింది. 1944, మే 29న సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయిందని, ఆపై 2002, మే 19న ఇదే ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇప్పుడు అదే స్థాయిలో భానుడు నిప్పులు కురిపించాడని అధికారులు వెల్లడించారు. మంగళవారం నాడు సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 46 డిగ్రీలు నమోదు కాగా, పాలమ్ ప్రాంతంలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.

ఎండ వేడిమి అధికంగా ఉండటంతో హస్తిన వాసులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంకన్నా అన్ని ప్రాంతాల్లో అధిక వేడిమి నమోదైంది. ఈ సంవత్సరం మే 19న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఈ నెలంతా సాధారణం కన్నా అధిక వేడిని ప్రజలు చూశారని ఐఎండీ (ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ - భారత వాతావరణ శాఖ) రీజనల్ ఫోర్ కాస్టింగ్ హెడ్ కుల్ దీప్ శ్రీవాత్సవ తెలియజేశారు. సఫ్దర్ జంగ్ ప్రాంతంలో ఆల్ టైమ్ రికార్డు 1944, మే 22న 47.2 డిగ్రీలుగా నమోదైందని ఆయన అన్నారు.

భానుడు చండ ప్రచండ నిప్పులను కురిపిస్తున్న వేళ, గడచిన 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా వేడిమి నమోదైన ప్రాంతాల్లో 10 ప్రాంతాలు ఇండియాలోనే ఉన్నాయి. వెదర్ మానిటరింగ్ వెబ్ సైట్ 'ఎల్ డొరాడో' వెల్లడించిన వివరాల ప్రకారం, రాజస్థాన్ రాజధాని జైపూర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురులో మంగళవారం నాడు 50 సెల్సియస్ డిగ్రీల వేడిమి నమోదైంది. థార్ ఎడారికి ముఖద్వారంగా చెప్పుకునే చూరు ప్రాంతంలో ప్రతి సంవత్సరమూ రికార్డు స్థాయిలో వేడిమి నమోదవుతూ ఉంటుంది. ప్రపంచంలోనే హాటెస్ట్ ప్లేస్ గా అభివర్ణించే పాకిస్థాన్ లోని జకోబాబాద్ లో నమోదైన వేడిమికి సమానంగా చురు లో ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.

చురుతో పాటు రాజస్థాన్ లోని బికనీర్, గంగా నగర్, పిలని పట్టణాల్లోనూ, ఉత్తర ప్రదేశ్ లోని బందా, హిస్సార్, మహారాష్ట్ర, హర్యానాలోనూ గరిష్ఠ వేడిమి నమోదైంది. న్యూఢిల్లీలో 47.6 డిగ్రీలు, బికనీర్ లో 47.4, గంగానగర్ లో 47, ఝాన్సీలో 47, పిలనిలో 46.9, నాగపూర్ లో 46.8, అకోలాలో 46.5 సెల్సియస్ డిగ్రీల వేడిమి నమోదైందని అధికారులు వెల్లడించారు. 2016, మే 19న 50.2 డిగ్రీలుగా నమోదైన చురు ఉష్ణోగ్రత, తిరిగి అదే స్థాయికి చేరడం ఇదే తొలిసారని స్థానిక వాతావరణ అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana police  Sun stroke  summer  heat wave  

Other Articles