SC allows LG Polymers staff access to plant ఎల్జీ పాలీమర్స్ పై ఏపీ హైకోర్టు అదేశాలలో జోక్యం చేసుకోలేం: సుప్రీం

Supreme court refuses to interfere in aphc order in lg polymers case

LG Polymers, gas leak, LG Polymers plant, styrene gas, styrene gas leak, toxicity, polymer factory, Visakhapatnam, National Green Tribunal, NGT, Companies Act, vizag gas leak, Supreme Court, AP HIgh Court, Andhra Pradesh, Politics

LG Polymers, gas leak, LG Polymers plant, styrene gas, styrene gas leak, toxicity, polymer factory, Visakhapatnam, National Green Tribunal, NGT, Companies Act, vizag gas leak, Supreme Court, AP HIgh Court, Andhra Pradesh, Politics

ఎల్జీ పాలీమర్స్ పై ఏపీ హైకోర్టు అదేశాలలో జోక్యం చేసుకోలేం: సుప్రీం

Posted: 05/27/2020 09:50 AM IST
Supreme court refuses to interfere in aphc order in lg polymers case

విశాఖ ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ సంస్ధను రాష్ట్రోన్నత న్యాయస్థానం సీజ్ చేస్తూ అదేశాలు వెలువరించిన తరుణంలో ఆ సంస్థ యాజమాన్యం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరిశ్రమ నుంచి స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ కారణంగా 12 మంది మృత్యువాత పడటంతో పాటు వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశ్రమలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సంస్థకు చెందిన 30 మంది సిబ్బందికి పరిశ్రమలోకి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. 28 మంది సిబ్బందితో పాటు ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కూడా పరిశ్రమలోకి వెళ్లేందుకు అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో న్యాయస్థానం అనుమలుతు మంజూరు చేసింది.

హైకోర్టు సంస్థను సీజ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేసింది. జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా పరిశ్రమలోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్‌లో కోరింది. విచారణ కోసం నియమించిన ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. దీంతో సంస్థలోకి 30 మంది సిబ్బంది వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతిని మంజూరు చేసింది. అయితే సంస్థలోనికి వెళ్తున్న 30 మంది సిబ్బంది జాబితాను జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని అదేశించింది.

ఎల్జీ పాలిమర్స్ సంస్థ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సంస్థలో వివిధ స్థాయిలో పాలిమర్ వుందని దానిని సీజ్ చేయడంతో అలానే వుంచితే అది విషపూరితం అవుతుందని కూడా చెప్పారు. దీంతో పాటు సంస్థలో డెలివరీకి సిద్దమైన సరుకు కూడా అలానే వుండిపోయిందని, దానిని కూడా రవాణా చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కోరింది. కాగా ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ కొనసాగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీనిపై ఎన్జీటీ లేదా హైకోర్టు పూర్తిగా విచారణ చేపడతాయని స్పష్టం చేసింది. హైకోర్టు, ఎన్జీటీలో విచారణ ముగిసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టుకు రావాలని ధర్మాసనం సూచించింది. జూన్‌ 1న ఎల్జీ పాలిమర్స్‌ కేసుపై ఎన్జీటీలో విచారణ జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles