COVID-19 | 38 fresh cases reported in AP ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Coronavirus latest updates slowdown of covid cases in ap 38 fresh cases in last 24 hours

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

In the last 24 hours, 38 new cases have been reported and this is for the first time after nearly three weeks that cases count have reported below 50. AP has tested 7,409 samples in the last 24 hours and 73 people got discharged.

ఏపీలో క్రమంగా నెమ్మదిస్తున్న కరోనావైరస్.. గడిచిన 24 గంటల్లో 38 కేసులు..

Posted: 05/11/2020 12:02 PM IST
Coronavirus latest updates slowdown of covid cases in ap 38 fresh cases in last 24 hours

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన నెమ్మదించింది. రాష్ట్రవాసుల్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి.. గ్రీన్ జోన్లను కూడా రెడ్ జోన్లుగా మార్చేసేలా చేసిన గత రెండు వారాల్లో విజృంభన వేగానికి తాజాగా కళ్లెం పడుతోంది. గత వారం చివరి నాలుగు రోజుల పాటు యాభై పైన కేసులు నమోదు చేసుకన్న రాష్ట్రం అందుకు ముందు మాత్రం ఏకంగా ఆరవై, డెబై కరోనా కేసులను నమోదు చేసుకుంది. దీంతో రాష్ట్రప్రజలు కలవరపాటుకు గురయ్యారు. అయితే క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రవాసులకు స్వల్ప ఊరటనిస్తోంది.

ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వీటితో పాటు మిషన్ లను కూడా ఏర్పాటు చేసుకోవడంతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 38 కేసులు మాత్రమే నమోదు కాగా, దాదాపు మూడు వారాల తరువాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ కఠిన నిబంధనలు, వైద్యులు, హెల్త్ వర్కర్ల, పోలీసుల శ్రమకు ఫలితం లభిస్తోంది. కొత్తగా నమోదైన 38 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేల మార్కు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 2018కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా నమోదుకాకపోవడం వైద్యులకు ఊపిరిపీల్చుకుంటున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 44 మరణాలు సంభవించడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వైద్యుల శ్రమకు ప్రతిఫలం చేకూర్చేలా ఫలితాలు వస్తుండటం విశేషం.  తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా చిత్తూరులో 9, కర్నూలులో తొమ్మిది, అనంతపురంలో ఎనమిది, గుంటూరులో ఐదు, కృష్ణాలో మూడు, విశాఖపట్నంలో మూడు, నెల్లూరులో ఒక్క కేసు నమోదయ్యాయి, ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 998 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 975 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 115 కరోనా కేసులు నమోదుకాగా, 4 మరణాలు సంభవించాయి. చిత్తూరులో 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, తూర్పు గోదావరిలో 46 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 387 కేసులు ఎనమిది మరణాలు సంభవించాయి, కడపలో 97 కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 342 పాజిటివ్ కేసులు, పదమూడడు మరణాలు. కర్నూలులో నమోదైన కరోనా కేసులు 575గా వుండగా, 16 మరణాలు సంభవించాయి. నెల్లూరు-102 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 63, శ్రీకాకుళంలో ఐదు కేసులు నమోదయ్యాయి, విశాఖపట్నంలో 66 కరోనా కేసులు నమోదుకాగా ఒక మరణం సంభవించింది. విజయనగరంలో 4, పశ్చిమగోదావరి-68 కేసులు నమోదయ్యాయి,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles