Don't hinder movement of migrant workers, MHA tells states వలస కార్మికులపై రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలు..

Ensure migrants don t end up walking on rail tracks mha to states

special train, non stop train, migrant workers, Shramik Trains, Special Buses, Ajay Bhalla, Home Ministry, Railways Ministry

The Union Home Ministry has requested all the states and Union Territories of the country to cooperate with the Railways Ministry to ensure that there are more of the special ‘Shramik’ trains in service for the migrant labourers, amid the coronavirus crisis.

వలస కార్మికులపై రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలు..

Posted: 05/11/2020 11:09 AM IST
Ensure migrants don t end up walking on rail tracks mha to states

కరోనావైరస్ మహమ్మారి విజృంభనను కట్టడి చేసేందుకు మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో వున్న వలస కార్మికులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఈ క్రమంలో తొలిదశ లాక్ డౌన్ నేపథ్యంలోనే ఆకలితో అలమటిస్తూ, వుండలేక భార్యబిడ్డలతో తమ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికులు కాలినడకను వందల కిలోమీటర్లు నడిచిన ఘటనలు ఉత్పన్నమయ్యాయి, ఈక్రమంలో తమ మజిలీలకు చేరుకునే ప్రయత్నంలో పలువురు వలసజీవులు తుదిమజిలీకి చేరకున్నారు.

ఇక మూడో విడత లాక్ డౌన్ అవమల్లోకి వచ్చిన తరువాత తమ కోసం శ్రామిక్ రైళ్లు నడపుతుందన్న సమాచారం కూడా బహుదూరపు బాటసారులకు తెలియకపోవడంతో ఇంకా వారు కాలిబాటనే తరలుతున్నారన్న సమాచారం అందిన కేంద్రం.. తాజాగా వలస కార్మికుల తరలింపుపై తాజాగా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేసింది. ఇక దీనికి తోడు వలస కార్మికులు నడకమార్గంలో నడుస్తూ రావడంతో కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని, దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రహోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు.

వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికులను రోడ్డు లేదా ప్రత్యేక శ్రామిక్ రైలు ప్రయాణాల ద్వారా తరలిచాలని భల్లా పేర్కోన్నారు. ఇక వీరి కాలిబాటన నడవనీయకుండా చర్యలు తీసుకోవాలని అదేశించింది. రైళ్లలో ప్రయాణించే వరకు కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపులు కోనసాగించడంతో పాటు నీరు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. స్వస్థలాలకు వెళ్లే కూలీలకు అవకాశం కల్పించాలన్నారు. మెడికల్, పారిశుధ్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రైవేటు క్లినిక్ లు తెరిచే విషయాలపై కూడా సూచనలు చేశారు. 

MHA writes to all States/UTs to cooperate with @RailMinIndia in running more #ShramikSpecialTrains without any hindrance & facilitate faster movement of stranded #MigrantWorkers to their native places.

They may be counseled to not walk on roads & rail tracks.#COVID19 pic.twitter.com/aQi70GFTFi

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles