JEE Main, NEET 2020 exam dates announced జేఈఈ, నీట్‌ పరీక్షల తేదీలు ఖరారు చేసిన కేంద్రం

Jee main 2020 new exam dates announced exams from july 18 to 23 hrd minister

jee main nta nic in, jeemain nta nic in, jee main 2020 exam date, jee main exam dates, jee exam dates, union hrd minister, hrd minister updates, hrd minister

JEE Main 2020 examination would be conducted from July 18 to July 23, 2020. The examination will be conducted on July 18, 20, 21, 22, and 23, 2020 at various centres across the country. Candidates can check the official site of NTA JEE at jeenta.nic.in for latest updates.

జేఈఈ, నీట్‌ పరీక్షల తేదీలు ఖరారు చేసిన కేంద్రం

Posted: 05/05/2020 06:22 PM IST
Jee main 2020 new exam dates announced exams from july 18 to 23 hrd minister

ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి.  ఏప్రీల్ మాసంలో జేఈఈ, మే మాసంలో నీట్ పరీక్షలు జరగాల్సి వున్నా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసింది. దీంతో ఇవాళ తాజాగా ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించే విషయాలను కేంద్రం వెలువరించింది. జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్‌)‌, జులై 26న నీట్‌, ఆగస్టులో జేఈఈ అడ్బాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు.

కాగా దేశీయంగా జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు ఎదురుచూస్తుండగా, నీట్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 15.93 లక్షల మంది ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పలువురి విద్యార్థులతో ఆయన సోషల్ మీడియా సాధానాల ద్వారా అన్ లైన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలను ఇచ్చారు. ఈ సందర్భంగా వాయిదా పడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇక రానున్న ఏడాది మాత్రం విద్యార్థులు కొంత తక్కువ సిలబస్ ను నేర్చుకోవాల్సి వుంటుందని అన్నారు, విద్యార్థులు విలవైన విద్యా సంవత్సరంలోని కొంత కాలాన్ని కోల్పోవడంతో తాము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, అందుకు తగ్గిన నిష్పత్తిలోనే రానున్న విద్యా సంవత్సరాన్ని, తగిన పోర్షన్ ను రూపోందిస్తామని చెప్పారు, దీంతో ఆ తరువాత రానున్న జేఈఈ మెయిన్స్ పరీక్షల్లోనూ సిలబస్ లో విద్యార్థులు నేర్చుకున్న సిలబస్ నుంచే ప్రశ్నాపత్రాలు వుంటాయని కేంద్రమానవ వనరులు శాఖా మంత్రి తెలిపారు. కాగా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ ప్రతిపాదనను ముందుగా కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles