‘YCP Govt is CORONA FRIENDLY’: Pawan Kalyan ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద విధులా.?: జనసేనాని ఫైర్

Jagan makes teachers guard wine shops pawan fires

Pawan Kalyan, YSRCP Government, Wine Shops, Teachers Guard wine shops, coronavirus, JanaSena, Twitter, Andhra Pradesh, Politics

Janasena chief Pawan Kalyan fires on the decision of Jagan and tweeted, ” Don’t bring down the morale of ‘TEACHERS’. I wonder! what if, Late Sri Sarvepalli Radhakrishnan would have felt, after reading this news, that AP Govt is forcing ‘teachers to guard liquor shops’ instead of teaching. ”

ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద విధులా.?: పవన్ కల్యాణ్ ధ్వజం

Posted: 05/05/2020 05:24 PM IST
Jagan makes teachers guard wine shops pawan fires

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో పలు సడలింపులతో దేశవ్యాప్తంగా మూడోవిడత లాక్ డౌన్ అమల్లోకి రావడంతో.. దేశంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్రీన్, అరెంజ్ జోన్లు వున్న జిల్లాలో మద్యం దుకాణాలు తెరచుకోవడంతో గత 40 రోజులుగా మద్యం కోసం అంగలార్చిన మందుబాబుల తాకిడి అధికంగా వుంది. దీంతో పోలీసులతో పాటు ఉపాధ్యాయులను కూడా అంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాల మందుబాబులను కట్టడి చేసే విధులకు పురమాయించడం విమర్శలకు తావిస్తోంది. అన్ని వర్గాల నుంచి ఈ మేర ఏపీ సర్కార్ విమర్శలు ఎదుర్కోంటోంది.

రాష్ట్రంలోని పలుచోట్ల మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానాన్ని మరింత పథిలపర్చాల్సిన ప్రభుత్వాలు.. వారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మద్యం దుకాణాల వద్ద మందుబాబులను కట్టడి చేసే విధులకు పురమాయించడం సరికాదని హితవు పలికారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అన్నార్తులకు ఆహారం, నిత్యావసరాల సరఫరా చేయడం కోసం ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవడం సబబుగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.

ప్రజలు కరోనా వ్యాప్తి కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారని, ఆలయాలకు ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్లకుండా, పండుగలకు కూడా దూరమయ్యారని, అదే సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి లాక్ డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాతే తమిళనాడులోని వేలూరు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో గోడ కట్టేశారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా జనసైనికులతో టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

వైసీపీ ప్రభుత్వం కరోనా ఫ్రెండ్లీగా మారిందని విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైసీపీ... అధికారంలోకి వచ్చాక విడతల వారీగా బంద్ చేస్తామని మాట మార్చింది. మద్యం ధరల పెంపుతోనే మద్యనిషేధాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీని ద్వారా తాగుడుకు బానిసైన బతుకులు ఎంతకైనా దిగజారుతాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల వేళ మహిళల ఓట్ల కోసం ఇచ్చిన మాటకు వైసీపీ ప్రభుత్వం కట్టబడి లేదని ఈ చర్యల ద్వారా అర్థమవుతోందని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకు చెప్పేదొకటి,. ఆచరణలో చేసేదోకటిగా వైసీపీ చర్యలున్నాయని విమర్శించారు.

మద్యాన్ని నిషేధించడానికి వైసీపీ ప్రభుత్వానికి మంచి అవకాశం లభించినా.. వినియోగించుకోలేక పోయిందని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల తెరిచిన ఫలితం ఇదేనంటూ సోషల్ డిస్టెన్స్ లేకుండా పొడవాటి క్యూలో జనాలు నిల్చున్న వీడియోను పోస్ట్ చేశారు. సామాజిక దూరం పాటించడం కష్టమంటూ ఆలయాలు, చర్చిలు, మసీదులను బలవంతంగా మూసేశారని... లిక్కర్ షాపులకు మాత్రం ఇది వర్తించదా? అని ప్రశ్నించారు. మద్యం విక్రయాలకు సామాజిక దూరం లేకపోయినా పర్వాలేదా? అని అన్నారు. మద్యం దుకాణాలను ప్రారంభించిన రోజే  ఆత్మహత్యలు చోటుచేసుకోవడం కలచివేసిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపంతో భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారనే వార్తను ట్విట్టర్లో షేర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles