Only distressed persons allowed to go home: MHA కేంద్రహోంశాఖ తాజా అదేశాలు.. ఇక అంతరాష్ట్ర ప్రయాణాల ఈజీ

Centre s clarification on who can go back home leads to even less clarity

MHA, Union Home Minisry, Ajray Bhalla, Chief Ministers, distressed stranded people, workplace, native place, lockdown, migrant workers, NDA government, Indian Railways

Union Home Secretary Ajay Bhalla in a letter to the state Chief Secretaries of all states have requested them to facilitate the movement of such distressed stranded persons who had moved from their native places or workplaces just before the lockdown period but could not return back due to the restrictions.

లాక్ డౌన్ పై కేంద్రహోంశాఖ తాజా అదేశాలు.. ఇక అంతరాష్ట్ర ప్రయాణాల ఈజీ

Posted: 05/04/2020 05:42 PM IST
Centre s clarification on who can go back home leads to even less clarity

రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతించే విషయమై గతంలో ఇచ్చిన నిబంధనల సడలింపుపై కేంద్ర హోమ్ శాఖ తాజాగా మరింత స్పష్టతను ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన వలస కార్మికులు, టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థులు మాత్రమే ప్రస్తుతానికి ప్రయాణం చేసేందుకు అర్హులని క్లారిటీ ఇచ్చింది. అటు పనిచేసే చోటుకు, ఇటు స్వస్థలాలకు చేరుకోకుండా.. లాక్ డౌన్ కారణంగా మధ్యలో చిక్కుకుపోయిన వలస కూలీలు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు మాత్రమే ప్రస్తుతం ప్రయాణించేందుకు అర్హులని వివరణ ఇచ్చింది.

సాధారణ ప్రజల ప్రయాణాలకు అనుమతి లేదని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారాన్ని పంపామని హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. ఈ మేరకు కేంద్రహోంమంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రస్తుతం ఎవర్ని అంతర్ రాష్ట్రాల మధ్య అనుమతించాలన్న విషయమై ఆయన జారీ చేసిన లేఖలో.. రెండురోజుల ముందు విడుదల చేసిన వివరాలకు కొంత భిన్నంగా వుంది. తమ స్వస్థలాల నుంచి లాక్ డౌన్ కు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ కు రోజుల ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాహనాలు కూడా స్వస్థలాలకు చేరవచ్చని అజయ్ భల్లా తెలిపారు. ఉద్యోగార్థం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. సాధారణ కార్యకలాపాలు, వేడుకలు, విందులకు స్వస్థలాలకు వెళ్లేందుకూ అనుమతి లేదని స్పష్టం చేశారు. కాగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల తరలింపు గత వారంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీరి తరలింపునకు ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేయగా, ఎంతో మంది సాధారణ ప్రజలు రైల్వే స్టేషన్లకు పరుగులు తీశారు. వీరందరినీ అడ్డుకునేందుకు పోలీసులు, అధికారులు నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హూమ్ శాఖ క్లారిటీ ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles