Indian wins UAE lottery worth over Rs 20 crore యూఏఈలో లక్కీలాటరీ జాక్ పాట్ కోట్టిన కేరళవాసి

Indian salesman in uae wins whopping 10 million dirhams at a lucky draw

indian salesman, Abu Dhabi draw, UAE lottery, Abu Dhabi draw, Parameswaran, uae lottery, ajman lottery, Dilip Kumar parameswaran, Kerala

An Indian salesman in the UAE has won a whopping 10 million dirhams at an Abu Dhabi draw, a media report said. Dileep Kumar Ellikkottil Parameswaran, from Kerala's Thrissur, works with an auto spare parts company in Ajman and earns 5,000 dirhams (USD 1,361) a month.

అమ్మకాల కష్టాలకు చెక్: యూఏఈలో జాక్ పాట్ కోట్టిన కేరళవాసి

Posted: 05/04/2020 04:44 PM IST
Indian salesman in uae wins whopping 10 million dirhams at a lucky draw

పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వలస వెళ్లిన బతుకులు అక్కడ బతకలేక చాలీ చాలని జీతాలతో జీవితాలను ఈడుస్తుంటే.. వారి కష్టం చూసి దేవుడికే జాలేసిందా.? అనిపించేలా జరిగిందీ ఘటన. ఎన్ని కష్టాలు ఎదురైనా తన మానన తాను కష్టాలను ఓర్చుకుంటూ.. దేవుడా.. నీదే భారమంటూ బతుకును ఈడుస్తూ వస్తున్నాడు. అయితే మొత్తానికి దేవుడు కరుణించాడు. నారు పోసినవాడే నీరు పోస్తాడన్న చందాన.. ప్రస్తుత కాలంలో నిజం కాకుండా పోతున్న నానుడిని నిజం చేసేందుకు అనుగ్రహించి నీరుపోసాడు.. నారుపోసివాడు.

దేశంకాని దేశం.. పడరాని పాట్లు పడుతూ కూడా తన కష్టంతో పాటు దేవుడిపై భారం వేస్తూ కొన్న లాటరీ టికెట్.. తన అదృష్టాన్ని మార్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అదే జరిగింది. ఆయనను పరాయిదేశంలో అదృష్ట లక్ష్మి వరించింది. వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందిన దిలీప్ కుమార్ ఎల్లికొట్టిల్ పరమేశ్వరన్ బతుకుదెరువు కోసం యూఏఈలోని అజ్మన్ కు వెళ్లాడు. ఉన్న ఊళ్లో బతుకు బారమై గల్ప్ దేశాలకు వెళ్లాడు. అంతేకాదు తన భార్యా ఇద్దరు పిల్లలతో పాటు అక్కడికి పయనమయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల నుంచి అక్కడే జీవనాన్ని సాగిస్తున్నాడు.

అక్కడ ఆటో స్పేర్ పార్ట్స్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య గృహిణి కావడంతో కుటుంబ పోషణ మొత్తం అతని పైనే పడింది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 14న ఆన్ లైన్ లో ఆయన లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. నిన్న తీసిన లక్కీ డ్రాలో జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 20.63 కోట్లు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గెలిచిన డబ్బుతో మొదట అప్పులను తీర్చేస్తానని చెప్పాడు. మిగిలిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UAE lottery  Abu Dhabi draw  Parameswaran  uae lottery  ajman lottery  Kerala  

Other Articles