Coronavirus: Likely to Last Two Years, Report శీతాకాలంలో మలి విడత కరోనా.. మరింత ఉదృతం: అధ్యయనం

Expert report predicts up to two more years of pandemic misery

coronavirus, corona second wave, covid-19, corona pandemic, Spanish flu, University of Minnesota, SARS-CoV-2 RNA, America, US

If COVID-19 follows a pattern set by the 1918 Spanish flu, the pandemic is likely to last up to two years and return with a vengeance this fall and winter a second wave worse than the first, according to a study issued from the University of Minnesota.

శీతాకాలంలో మలి విడత కరోనా.. మరింత ఉదృతం: అధ్యయనం

Posted: 05/02/2020 11:49 AM IST
Expert report predicts up to two more years of pandemic misery

మానవాళి ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తూ.. మనిషి మనుగడకు పెను సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ అప్పుడే ఆరు నెలలు గడిచింది. ఎండకాలం కూడా రమారమి పూర్తి కావస్తోంది. ఇక మిగిలింది ఒక నెల మాత్రమే. ఆ తరువాత వర్షాకాలంలో సాధరణంగానే వైరస్ ఫ్లూలు, అతిసారవ్యాధులతో పాటు అంటువ్యాధులు ప్రబలే కాలం. ఈ నేప్యంలో కరోనా మహమ్మారి ఎప్పటికి కట్టడి అవుతుంది.? దేశం, ప్రపంచం నుంచి ఎప్పుడు వైదొలుగుతాయన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఈ క్రమంలో తాజా అధ్యయన వార్త అందోళన రేపుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం రెండేళ్ల వరకు ఉండే అవకాశం ఉందని అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం అంచాన వేసింది. ఈ మేరకు కరోనావైరస్ పై తాజా అధ్యయనం చేసిన యూనివర్సిటీ నిపుణుల బృందం కరోనావైరస్ వ్యాప్తి కనీసం 18-24 నెలలు ఉండొచ్చని.. అంచనా వేసింది. ఇక అగ్రరాజ్యంలోని 5 నుంచి 15 శాతం మంది ఈ వైరస్ బారిన పడతారని పేర్కొంది.

కరోనా మహమ్మారి క్రమేపీ 2021లో బలహీనపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇదే అందోళన రెకెత్తిస్తున్న క్రమంలో మరో దిగ్భ్రాంతి కలిగించే అంచనాను కూడా తెలిపింది. ప్రస్తుతం తొలి విడత కరోనా ప్రభావం నడుస్తోందని, వర్షాకాలం తరువాత శీతాకాలంలో రెండవ విడత ప్రభావం కొనసాగుతుందని, మలి విడత ప్రభావం తొలివిడత కన్నాఅత్యధికంగా వుండనుందని అంచానా వేసింది. దీంతో కరోనా మహమ్మరిని ఎదుర్కోవడమెలా అన్న అందోళన ప్రప్రంచ దేశాల్లో వ్యక్తం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles